twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుకుమార్ నెక్ట్స్ ఆ స్టార్ హీరోతోనే కన్ఫర్మ్ !!

    By Srikanya
    |

    ఆర్య చిత్రంతో తనకంటూ ఓ ముద్రవేసుకున్న సుకుమార్ త్వరలో మహేష్ చేయనున్నాడనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అవి ఇప్పుడు నిజం కానున్నాయి. సుకుమార్ రీసెంట్ గా ఈ మేరకు స్క్రిప్టు వర్క్ పూర్తి చేసి మహేష్ కి నేరేట్ చేసినట్లు సమాచారం. అలాగే మహేష్ కూడా ఓ కొత్త తరహా చిత్రంగా దాన్ని భావించి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్తున్నారు. ఇక మహేష్ ని ఎవరూ చూపని కోణంలో క్యారక్టరైజేషన్ ప్రధానంగా చూపుతానని మాట ఇచ్చినట్లు చెప్తున్నారు. అయితే శ్రీనువైట్ల దూకుడు సెకెండ్ షెడ్యూలు తర్వాత ఈ చిత్రం మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సుకుమార్, నాగార్జున కుమారుడు నాగచైతన్య తో ఓ చిత్రం రూపొందిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ వారు నిర్మిస్తున్నారు. ..ఈ చిత్రం కోసం 'దటీజ్‌ మహాలక్ష్మి.." అనే టైటిల్ ‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X