మహేష్‌ బాబుది మరొకటి మొదలైంది

By Srikanya

బిజినెస్ మ్యాన్ సూపర్ హిట్ తో స్పీడు మీదున్న మహేష్ బాబు మరో చిత్రం మొదలైంది. ఆదివారం హైదరాబాద్ లో సుకుమార్ దర్శకత్వంలో రూపొందే చిత్రం మొదలైంది. దిల్‌రాజు, ఎస్.ఎస్.రాజమౌళి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో మహేష్ సరసన ఓ కొత్త అమ్మాయిని నటింపజేయాలని సుకుమార్ భావిస్తున్నట్లు తెలిసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం రత్నవేలు. సుకుమార్‌తో గతంలో ఆర్య, ఆర్య2 చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన రత్నవేలు... రజనీకాంత్ 'రోబో'తో సంచలన ఛాయాగ్రహకునిగా మారారు.

సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు... ఈ ముగ్గురూ మహేష్‌తో పనిచేయడం ఇదే ప్రధమం. మహేష్ ఇమేజ్‌ని రెట్టింపు చేసే విధంగా అద్భుతమైన కథతో సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. మార్చి లేదా ఏప్రిల్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలిసింది. ఇక మహేష్‌తో 'దూకుడు' లాంటి బ్లాక్‌బాస్టర్ చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, గోపిచంద్ ఆచంట, రామ్ ఆచంట వారి 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు...వెంకటేష్‌ కాంబినేషన్ లో 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'లో నటిస్తున్నారు. అడ్డాల శ్రీకాంత్ దర్శకత్వంలో రూపొందే ఆ చిత్రంలో సమంత హీరోయిన్ గా చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X