twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బడి కట్టించేస్తున్న లెక్కల మాస్టారు... సొంతూరికి సుకుమార్ ఆర్ధిక సహాయం

    |

    చక్కగా పాఠాలు చెప్పాడు, అంతకు మించిన మంచి సినిమాలు తీశాడు. ఇప్పుడు పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడమే తరువాయి అంటున్నాడు స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్. ఇప్పటికే ఎన్నో చారిటీ కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకున్న సుక్కు, ఇప్పుడు సొంతగూటికి చక్కని సదుపాయాలు సమకూర్చడంలో తలమునకలయ్యాడు.
    తూర్పుగోదావరి జిల్లా, మట్టపర్రు అనే చిన్న గ్రామం నుంచి వచ్చిన సుకుమార్, ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. అయితే, తనను స్ఫూర్తిగా తీసుకునే తన సొంతూరి యువతకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో, ఊరిలోమంచి పాఠశాలను నిర్మించే బాధ్యతను భూజాన్న వేసుకున్నాడు.

    Sukumar On a Charity Spree

    ఇటీవలే రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు పాఠశాల భవనానికి పునాది రాయి వేయగా, సుకుమార్ 14లక్షల రూపాయిలను పాఠశాల నిర్మాణం నిమిత్తం అందజేశాడు. ఊరిలో ఇప్పటివరకూ పాఠశాల లేకపోవడంతో పిలలు చదువుల కోసం పక్క ఊళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇకపై ఆ అవసరం ఉండదని ఊరి జనాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    తన తండ్రి తిరుపతి నాయుడుతో మంచి అనుబంధం కలిగిన సుకుమార్, ఇప్పటికే ఆయన పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. తాజా చర్యతో సుక్కూ మరో మెట్టు పైకి ఎక్కాడనే చెప్పాలి. మరి ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఇలాగే మరిన్ని మంచి పను చేస్తూ ముందుకు సాగాలని కోరుకుందాం.

    English summary
    Director Sukumar goes on a charity spree as he comes forward to build a two-storey school building in his hometown. Donates 14 lacks rupees cash for the same.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X