twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘జిగేల్ రాణి’ సింగర్‌కు ఎట్టకేలకు న్యాయం... సుకుమార్ ఎంత ఇచ్చారో తెలుసా?

    By Bojja Kumar
    |

    Recommended Video

    Sukumar Pays Huge Amount to Jigelu Rani Singer

    'రంగస్థలం' సినిమాలో జిగేల్ రాణి పాట ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాట పాడింది గంటల వెంకటలక్ష్మి అనే ఒక జానపద గాయిని. మీడియేటర్ ద్వారా ఆమె తొలిసారి సినిమాల్లో పాడే అవకాశం దక్కించుకుంది. తన పాటతో పాటు సినిమా కూడా పెద్ద హిట్టయింది. బాక్సాఫీసు వద్ద ఈ మూవీ వందల కోట్లు వసూలు చేసింది. అయితే పాట పాడి అన్ని రోజులైనా మీడియేటర్ నుండి తనకు ఒక్క రూపాయి కూడా ముట్టకపోవడంతో ఈ విషయాన్ని మీడియా చానల్స్ దర్శక నిర్మాతల దృష్టికి తీసుకురావడంతో సెన్సేషన్ అయింది.

    ఎట్టకేలకు గంటల వెంకట లక్ష్మికి న్యాయం

    ఎట్టకేలకు గంటల వెంకట లక్ష్మికి న్యాయం

    ఎట్టకేలకు గంటల వెంకట లక్ష్మికి న్యాయం జరిగింది. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న దర్శకుడు సుకుమార్ ఆమెకు భారీ మొత్తం అందజేశారు. నేరుగా ఆమె అకౌంట్లో డబ్బులు వేశారు.

     ఎంత ఇచ్చారో తెలుసా?

    ఎంత ఇచ్చారో తెలుసా?

    వెంకట లక్ష్మి మాట్లాడుతూ... మీడియా వల్లనే తనకు ఈ రోజు న్యాయం జరిగిందని, దర్శకడు సుకుమార్ స్పందించి రూ. లక్ష తన అకౌంట్లో వేశారని, ఆయన విశాల హృదయం ఉన్నవారు అని ముందే చెప్పాను, మీడియేటర్ వల్లనే తనకు అన్యాయం జరిగిందన్నారు.

    రూ. 3 వేలు ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకున్న మీడియేటర్

    రూ. 3 వేలు ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకున్న మీడియేటర్

    నాగ భూషణం అనే మీడియేటర్ ద్వారా తాను ఈ సినిమాకు పాట పాడాను. వైజాగ్‌లో ఆడియో లాంచ్ జరిగినపుడు ఆయన ఫోన్ చేశారు. వచ్చి పేపర్ల మీద సంతకం పెడితే రూ. 3 వేలు ఇస్తామన్నారు. ప్రయాణ ఖర్చులకు కూడా సరిపోని ఆ డబ్బు తనకు వద్దని తిరస్కరించినట్లు వెంకట లక్ష్మి తెలిపారు.

    మరిన్ని అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చారు

    మరిన్ని అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చారు

    సుకుమార్ ద్వారా ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు నన్ను సంప్రదించారు. తాము చేయబోయే సినిమాల్లో పాడే అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. మీడియేటర్లను నమ్మ వద్దని, నేరుగా తమనే సంప్రదించాలని తెలిపినట్లు వెంకట లక్ష్మి తెలిపారు.

    నటించే అవకాశం ఇచ్చినా చేస్తాను

    నటించే అవకాశం ఇచ్చినా చేస్తాను

    సినిమాల్లో పాటలు పాడే అవకాశంతో పాటు నటించే అవకాశం ఇచ్చినా తాను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని వెంకట లక్ష్మి తెలిపారు. సినిమాలతో పాటు ఏ ఫ్రోగ్రాంలో అయినా పాడటానికి పిలిస్తే వస్తానన్నారు.

    English summary
    Rangasthalam movie derector Sukumar Pays Huge Amount To "Jigelu Rani" song Singer Gantala Venkata Lakshmi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X