సుకుమార్ ప్లాన్స్: ప్రభాస్, బన్నీలతో నెక్ట్స్, ఓ మల్టీ స్టారర్ కూడా...
'బాహుబలి' ప్రాజెక్టుతో నేషనల్ హీరోగా ఎదిగిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో సినిమాలు చేయడానికి చాలా మంది పెద్ద డైరెక్టర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూడా ఉన్నారు. ఇటీవల మీడియా ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
సుకుమార్ ప్రస్తుత చిత్రం 'రంగస్థలం' విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లలో ఆయన బిజీ అయ్యారు. 'రంగస్థలం' తర్వాత ఏయే సినిమాలు చేయబోతున్నారనే ప్రశ్నకు సుకుమార్ స్పందిస్తూ... త్వరలో ప్రభాస్‌తో ఓ సినిమా, అల్లు అర్జున్‌తో ఓ సినిమా, దీంతో పాటు ఓ మల్టీ స్టారర్ మూవీ కూడా ప్లాన్ చేస్తున్నట్లు సుకుమార్ వెల్లడించారు.

ఆయన ఈ విషయాన్ని ఓపెన్‌గా చెప్పడాన్ని బట్టి చూస్తూ ఈ ఇద్దరు హీరోలకు తను అనుకున్న స్టోరీ పాయింట్ చెప్పి ఒప్పించినట్లు స్పష్టం అవుతోంది. త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో ప్రభాస్, బన్నీ సినిమాలు తెరపై చూడబోతున్నారు. సినిమాలు చేయడంలో చాలా స్లో అనే ఒక ముద్ర వేసుకున్న సుకుమార్ ఈ ఇద్దరితో సినిమాలను ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో వేచి చూడాలి.
కాగా... సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' సినిమా మార్చి 30న విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











