twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుకుమార్ పవర్ఫుల్ లైనప్.. పుష్ప 2 తరువాత మొత్తం ఎన్ని సినిమాలంటే?

    |

    క్రియేటివ్ గా అందరికంటే భిన్నంగా ఆలోచించే దర్శకుడు సుకుమార్ పుష్ప మొదటి బాగంతో తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ ఓపెనింగ్స్ తో సుకుమార్ హీరోల స్థాయిని కూడా పెంచుతూ ఉంటాడు. ఇక మొదటి పాన్ ఇండియా మూవీ మొత్తానికి బాగానే ఆకట్టుకుంది. ఇక పుష్ప 2 తరువాత సుకుమార్ ఎవరెవరితో సినిమాలు చేస్తాడు అనే విషయంలోకి వెళితే..

    నెగిటివ్ కామెంట్స్..

    నెగిటివ్ కామెంట్స్..

    పుష్ప మొదటి భాగానికి మొదట్లో అనేక రకాల నెగిటివ్ కామెంట్స్ వచ్చిన విషయం తెలిసిందే. చాలా వరకు రివ్యూలు కూడా నెగిటివ్ గానే వచ్చాయి. సుకుమార్ తన స్థాయికి తగ్గట్టుగా సినిమాను ప్రజెంట్ చేయలేకపోయారని రెండవ భాగంపై పెద్దగా ఆసక్తి కూడా అనిపించిందని టాక్ వచ్చింది. కానీ అలాంటి కామెంట్స్ ఎన్ని వచ్చినా కూడా పుష్ప బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను రాబట్టింది.

    బాక్సాఫీస్ హిట్

    బాక్సాఫీస్ హిట్

    పుష్ప ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద 300కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక మొత్తానికి సినిమా అనుకున్నట్లే సక్సెస్ అవ్వడంతో సుకుమార్ తదుపరి సినిమాలపై మరింత ఆసక్తి పెరగనుందని చెప్పవచ్చు. మొదట పుష్ప రెండవ భాగంతో ఆకట్టుకోబోతున్నాడు. పుష్ప ది రూల్ ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.

    విజయ్ దేవరకొండతో ర్యాంపేజ్

    విజయ్ దేవరకొండతో ర్యాంపేజ్

    ఇక పుష్ప రెండవ భాగం అనంతరం సుకుమార్ విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నట్లు క్లారిటి వచ్చేసింది. ఇటీవల విజయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తూ తన తరువాత సినిమా సుకుమార్ తోనే అంటూ 2023లో ర్యాంపేజ్ అని పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం అభిమానులు ర్యాంపేజ్ పేరును సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.

     రామ్ చరణ్ తో కూడా..

    రామ్ చరణ్ తో కూడా..

    ఇక విజయ్ దేవరకొండ అనంతరం సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేయనున్నాడు. RRR ప్రమోషన్ లో రామ్ చరణ్ కూడా ఆ విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు. దర్శకుడు రాజమౌళి కూడా అందులో ఉండే ఒక ఇంట్రడక్షన్ సన్నివేశం అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయని ఎలివేట్ చేశాడు. తప్పకుండా ఆ సినిమా కూడా మరొక లెవెల్లో ఉంటుందని మొత్తానికి మరొక క్లారిటీ అయితే వచ్చేసింది.

    Recommended Video

    Tollywood Stars Top 10 Rankings : Prabhas మూడు.. Allu Arjun రెండు || Filmibeat Telugu
    పాన్ ఇండియా రేంజ్ లోనే మరో సినిమా..?

    పాన్ ఇండియా రేంజ్ లోనే మరో సినిమా..?

    విజయ్ దేవరకొండ - రామ్ చరణ్ లతో చేయబోయే రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా ఫార్మాట్ లోనే తెరపైకి రానున్నాయి. అంతే కాకుండా మరో ప్రాజెక్ట్ పై కూడా సుకుమార్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మధ్యలో ప్రభాస్ కోసం కూడా ప్రయత్నం చేసినట్లు టాక్ వచ్చింది గాని అది సెట్టవ్వలేదు. సుకుమార్ అయితే మరో మూడు ప్రాజెక్ట్ లతో భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

    English summary
    Sukumar powerful line up after pushpa 2,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X