SS Rajamouli ని ఆకాశానికి ఎత్తేసిన సుకుమార్. RRR చూసిన తర్వాత లెక్కల మాస్టారు ఎమోషనల్!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఎవరిని కదిలించినా వారి RRR మాటలే వినిపిస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రం విడుదల సందర్భంగా తెలుగు సినీ ప్రముఖులు మాత్రమే కాక భారతదేశం మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది దర్శకులు సినిమా మీద ప్రశంసల వర్షం కురిపించగా తాజాగా దర్శకుడు సుకుమార్ తనదైన శైలిలో స్పందిస్తూ విడుదల చేసిన ఒక పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు

 రాజమౌళి దర్శకత్వంలో

రాజమౌళి దర్శకత్వంలో

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం RRR. తెలుగులో రెండు పెద్ద కుటుంబాలకు చెందిన హీరోలు రామ్ చరణ్ తేజ, ఎన్టీఆర్ హీరోగా నటించిన ఒక బాలీవుడ్ హీరోయిన్ ఒక హాలీవుడ్ హీరోయిన్ సినిమాలో భాగమయ్యారు. అలాగే బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ రామ్ చరణ్ తండ్రి పాత్రలో నటించారు. ఇక శ్రియ రామ్ చరణ్ తల్లి పాత్రలో నటించారు.

ప్రశంసల వర్షం

ప్రశంసల వర్షం


సినిమా మొదటి ఆట నుంచే అద్భుతమైన స్పందన తెచ్చుకుంటోంది. అయితే చాలా వరకు పాజిటివ్ టాక్ వస్తున్నా కూడా డివైడ్ టాక్ సినిమాకు మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.. సాధారణ ప్రేక్షకులలోనే ఈ డివైడ్ టాక్ కనిపిస్తోంది కానీ దాదాపుగా సెలబ్రిటీ అందరూ సినిమా అద్భుతం అంటూ సినిమా మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..

మీరు తీయగలరు.. మేం చూడగలం

మీరు తీయగలరు.. మేం చూడగలం


ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు సినిమా చూసి సినిమా అద్భుతంగ ఉందని చెప్పగా తాజాగా సుకుమార్ RRR సినిమా చూడడమే కాక సినిమా మీద రివ్యూ కూడా ఇచ్చారు. అందులో రాజమౌళి గురించి ఆయన ఇలా రాసుకొచ్చాడు.. మీరు పక్కనే ఉన్నా మిమ్మల్ని అందుకోవాలంటే పరిగెత్తాలి.. మేం ఆకాశంలో ఉన్నా మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలి.. రాజమౌళి సార్.. మీకు మాకు ఒకటే తేడా.. ఇలాంటి సినిమా మీరు తీయగలరు.. మేం చూడగలం అంతే.. సుకుమార్ అంటూ పోస్ట్ చేశారు.

హరీశ్‌ శంకర్‌ కూడా

హరీశ్‌ శంకర్‌ కూడా


నిజానికి ఆ మధ్య పుష్ప సినిమా విడుదలైనప్పుడు రాజమౌళి కూడా ఇదే స్థాయిలో సుకుమార్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు. ఇప్పుడు RRR విషయంలో సుకుమార్ ప్రశంసలతో ముంచెత్తారు. ఇక RRR ఎంతో అద్భుతంగా ఉంది. భారతీయ సినిమా గర్వించే దర్శకుడు రాజమౌళికి, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లకు శుభాకాంక్షలు. అంటూ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ పేర్కొన్నారు.

 నారా లోకేష్ శుభాకాంక్షలు

నారా లోకేష్ శుభాకాంక్షలు

అలాగే RRR కు మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. నటులు, సాంకేతిక బృందానికి కంగ్రాట్స్‌. నా కుటుంబంతో కలిసి ఈ చిత్రాన్ని త్వరలోనే చూస్తా. ఈ సినిమా గత రికార్డులను బద్దలు కొట్టాలని ఆశిస్తున్నా. ఆల్‌ ది బెస్ట్‌ RRR అంటూ తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కూడా తన శుభాకాంక్షలు వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X