twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏరా అని పిలవలేకపోయాను.. కచ్చితంగా వంద కోట్ల సినిమా... ‘ఉప్పెన’పై సుకుమార్ రియాక్షన్

    |

    మొత్తానికి ఉప్పెన సినిమా రిలీజ్ చేయింది. దేవీ శ్రీ ప్రసాద్ తన సంగీతంతో వేసిన మంత్రంతో సినిమాపై అందరికీ అంచనాలు పెరిగాయి. తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసేయడంతో ఉప్పెన స్థాయి పెరిగిపోయింది. ఇప్పుడు సినిమాను కాపాడింది కూడా అదే. దేవీ అందించిన పాటలు, కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయని అందరూ అంటున్నారు. అయితే సినిమా క్లైమాక్స్ విషయంలోనే కొందరు పెదవి విరుచుతున్నారు.

    ఉప్పెన టాక్ అలా..

    ఉప్పెన టాక్ అలా..

    ఉప్పెన సినిమాపై డివైడ్ టాక్ వస్తోంది. సాధారణే కథే అయినా కూడా హీరో హీరోయిన్లు విలన్‌ తమ నటనతో, దేవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సినిమా స్థాయి పెరిగిపోయింది. ఇక క్లైమాక్స్‌లో ఆ ఒక్క సీన్, ఆ ట్విస్ట్ కూడా ముందే లీక్ అవ్వడంతో ఇప్పుడు అదే సమస్యగా మారింది. ఎమోషన్ పండాల్సిన సీన్‌లో ట్రోల్స్, మీమ్స్ పడుతున్నాయి.

    మొత్తానికి హిట్..

    మొత్తానికి హిట్..

    అయితే ఇప్పుడున్న సమయానికి ఉప్పెన సూపర్ హిట్‌గా దూసుకుపోయేట్టు ఉంది. పోటీలో ఏ సినిమా లేకపోవడంతో, మ్యూజిక్ పరంగా సినిమా టాప్ లెవెల్‌లో ఉండటం, విజయ్ సేతుపతి నటన, కృతి శెట్టి గ్లామర్, వైష్ణవ్ తేజ్ డెబ్యూ అని అందరూ ఉప్పెనకు ఓటు వేస్తున్నారు.

    సక్సెస్ సెలెబ్రేషన్స్..

    సక్సెస్ సెలెబ్రేషన్స్..

    ప్రస్తుతం ఉప్పెన టీం సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో మునిగి తేలింది. మైత్రీ నిర్మాతలు, బుచ్చిబాబు, సుకుమార్ ఇలా అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఉప్పెన ఇంత భారీ సక్సెస్ కొట్టినందుకు సంతోషంగా ఉందంటూ ఇది సునామీలాంటి విజయమని సుకుమార్ చెప్పుకొచ్చాడు.

    నన్ను గురువును చేశాడు..

    నన్ను గురువును చేశాడు..

    నేను గురువును అని అనుకోను.. కానీ ఇంత మంచి హిట్ ఇచ్చి నన్ను గురువును చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది.. ఇంతకు ముందు ఏరా బుచ్చి అని పిలిచేవాడిని.. కానీ సినిమా చూసి వచ్చాక ఏరా అని పిలవలేకపోయాను.. అందుకే బుచ్చి అని పిలిచానంటే అర్థం చేసుకోండి.. మళ్లీ చెబుతున్నా ఇది కచ్చితంగా వంద కోట్ల సినిమా.. అంటూ సుకుమార్ ఎమోషనల్ అయ్యాడు.

    English summary
    Sukumar Reaction on Buchi babu over Uppena Success,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X