రాధ్ధాంతం చెయ్యాల్సిన అవసరం లేదు:సుకుమార్
హైదరాబాద్: '1-నేనొక్కడినే' పోస్టర్‌పై సమంత పరోక్ష విమర్శ చేస్తూ తన ట్విట్టర్లో కామెంట్ చేయడం మహేష్ బాబు అభిమానులకు ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై మహేష్ బాబు, హీరోయిన్ సైతం తమ అభిప్రాయాలు చెప్పారు. ఈ చిత్రం రిలీజైన నేపధ్యంలో దర్శకుడు సుకుమార్ ఈ పోస్టర్ విషయమై మరో సారి ప్రస్దావన వచ్చింది. మీడియావారు ఈ చిత్రం ప్రమోషన్ సందర్భంగా టీవీ ఛానెల్ కి వచ్చిన సుకుమార్ ని ప్రశ్నించారు. దీనిపై సుకుమార్ స్పందించారు.

సుకుమార్ మాట్లాడుతూ...."సమంత ఇండస్ట్రీ అమ్మాయి...అందరికీ తెలుసు...సరదాగా ఓ ఫోన్ చేసి..సుకుమార్ ఆ పోస్టర్ బాగోలేదు..అంటే నేను తీసేసి ఉండేవాడిని...దాని కోసం ఆమె నెట్ లో పెట్టి అందరితో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానికోసం అందరూ అంత టైమ్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరమూ లేదు. ఇది నా సిన్సియర్ ఒపీనియన్. సో బయిటవాళ్లు ఎవరైనా అయితే నాకు ఫోన్ చేయలేకపోవచ్చు. ఇండస్ట్రీలో అయితే అందరికీ నా నెంబర్ తెలుసు. మేబీ ఆమె నాకు డైరక్ట్ గా కాల్ చేసి ఉండాల్సింది. తీసేసి ఉండేవాడ్ని. అయినా వాళ్లు అర్దం చేసుకుంది ఆపోజిట్ వేలో. సో ఉన్నవిషయం అర్దం చేసుకోకుండా రాద్దాంతం చేయటం అనేది ఐ డోంట్ నో..వై ..జస్ట్ మేబీ... ఒక్కకాల్ చేసి ఉంటే సరిపోయేదిగా..అది అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు..ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి...".
మహేష్ ఫ్యాన్స్ సైతం ...సమంత, సిద్దార్థ గెట్ లాస్ట్ అంటూ వారిపై ట్వీట్ల వర్షం కురిపించారు. సమంత కామెంట్లను సపోర్టు చేసిన హీరో సిద్ధార్థపై కూడా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మీరిద్దరూ ఇండస్ట్రీ నుంచి వెళ్లి పోవాలంటూ ఫ్యాన్స్ కామెంట్ చేసారు. ఇంతకీ అసలు సమంత చేసిన ట్వీట్ ఏమిటీ... సమంత ట్వీట్ చేస్తూ... ''విడుదలకు సిద్ధమవుతున్న ఓ సినిమా పోస్టర్ ఈ మధ్య చూశాను. ఆ పోస్టర్‌లో హీరో,హీరోయిన్స్ ని చూస్తుంటే మహిళల గౌరవాన్ని దిగజార్చేలా ఉంది''- ఇదీ సమంత చేసిన ట్వీటు.
14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, దర్శకత్వం : సుకుమార్.


Click it and Unblock the Notifications











