రాంచరణ్‌కు తప్పిన పెను ప్రమాదం.. ఖంగారు పడిపోయిన సుకుమార్, ఆ సన్నివేశంలో!
Recommended Video

రంగస్థలం చిత్రం విడుదలై రెండవ వారం గడుస్తున్నా ఆ ఫీవర్ ఇంకా అభిమానులని వీడడం లేదు. మగధీర తరువాత రాంచరణ్ కు నిఖార్సైన చిత్రం పడడంతో మెగా ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ సంబరాల వెనుక రంగస్థలం చిత్ర యూనిట్ ఏడాది సమయం కష్టం ఉంది. అదమైన కథని రూపొందించుకున్న సుకుమార్ కష్టపడి వెండి తెరపై రంగస్థలం అనే అద్భుతాన్ని ఆవిష్కరించాడు. దర్శకుడు సుకుమార్, రాంచరణ్ మరియు ఇతర యూనిట్ కు ప్రస్తుతం ప్రశంసలు దక్కుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. చిత్ర షూటిం సమయంలో రాంచరణ్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని సుక్కు తెలిపాడు.

రాంచరణ్ అద్భుత నటన
రంగస్థలం చిత్రం రాంచరణ్ కెరీర్ లో అద్భుత విజయంగా నిలిచింది. పల్లె టూరి నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం అందరి మనసులని బాగా హత్తుకుంది. ఇప్పటికి రంగస్థలం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బలమైన వసూళ్లు రాబడుతుండడం విశేషం. రాంచరణ్ నటనకు అంతా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు.

సుకుమార్ కష్టానికి ఫలితం
అదమైన పల్లెటూరి కథని రాసుకున్న సుకుమార్ అంతే అందంగా దానిని తెరపై ఆవిష్కరించారు. ఎక్కడా రాజీపడకుండా ఏడాది పాటు కస్టపడి సుకుమార్ రంగస్థలం చిత్రాన్ని తీశారు.

నాకు మాత్రమే తెలుసు
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. రంగస్థలం చిత్ర షూటింగ్ సమయంలో రాంచరణ్ కు పెను ప్రమాదం తప్పిందని రివీల్ చేశారు. ఈ విషయం కనీసం రాంచరణ్ కు కూడా తెలియదని ఆ సమయలో చాలా కంగారు పడ్డానని సుక్కు తెలిపాడు.

ఆ సన్నివేశం అదే
క్లైమాక్స్ లో రాంచరణ్ జగపతి బాబు కోసం వెతుకుతుంటారు. లాంచ్ లో వెళ్ళిపోతున్నాడనే అనుమానంతో కదులుతున్న లాంచ్ ని చేరుకోవడానికి నీటిలో ఈదుకుంటూ వెళ్తాడు. నీటిలో ఈదే సమయంలో లాంచ్ ఫ్యాన్ రెక్కలు చరణ్ కు చేరువగా వచ్చాయని, ఆ విషయాన్ని తాను మాత్రమే గమనించానని సుకుమార్ తెలిపాడు.

కంగారు పడ్డా
ఫ్యాన్ రెక్కలు చరణ్ ని సమీపిస్తున్న సమయంలో అసలేం జరుగుతోందని చాలా ఖంగారు పడ్డానని సుక్కు తెలిపాడు. చిరంజీవి గారు చరణ్ ని నా చేతుల్లో పెట్టారు. ఏం జరుగుతోంది అంటూ మనసులో ఆందోళన చెందానని తెలిపాడు. ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నానని, కనీసం చరణ్ కు కూడా ఈ విషయం తెలియదని సుక్కు అన్నారు.


Click it and Unblock the Notifications











