మహానటి చూశాక సుకుమార్‌కు ఎదురైన వింత అనుభవం.. ఆవిడ ఏడుస్తుంటే చెప్పలేకపోయా!
లెజెండ్రీ నటి సావిత్రి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కించిన మహానటి చిత్రం అద్భుత విజయం దిశగా దూసుకుపోతోంది. లోతుగా అధ్యయనం చేసి ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు నాగ అశ్విన్ కు నలువైపుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇటీవల రంగస్థలం చిత్రంతో ఘనవిజయం అందుకున్న సుకుమార్ తాజగా మహానటి చిత్రాన్ని చూసి స్పందించారు. మహానటి దర్శకుడు నాగ అశ్విన్ కు ఓ సందేశాన్ని సుకుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
సుకుమార్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఆ సందేశం అందరిని ఆకట్టుకుంటోంది. ప్రియమైన అశ్విన్ అంటూ మొదలు పెట్టిన సుక్కు మహానటి చూసాక తనకు ఎదురైన అనుభవం గురించి వివరించాడు.

మహానటి చితం చూసి బయటకు వచ్చి నాగ అశ్విన్ తో మాట్లాడాలని అతడి ఫోన్ నెంబర్ కోసం ట్రై చేస్తున్నా. ఇంతలో ఓ మహిళ వచ్చి నువ్వు డైరెక్టరా బాబు అని అడిగింది. అవునన్నాను. వెంటనే నన్ను గట్టిగా పట్టుకుని ఎంతబాగా చూపించావు బాబు మా సావిత్రమ్మని అని ఏడ్చేసింది. నా కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. నేను నాగ అశ్విన్ కాదని చెప్పలేకపోయా. ఆవిడ ప్రేమనంతా నేనే తీసుకున్నా. కొన్ని క్షణాల పాటు నేనే నాగ అశ్విన్ గా మారిపోయాయి. ఇంతకంటే ఈ చిత్రం గురించి ఏం చెప్తాను.. అంటూ సుకుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.


Click it and Unblock the Notifications











