»   » దర్శకుడు సుకుమార్‌‌కు పితృ వియోగం !

దర్శకుడు సుకుమార్‌‌కు పితృ వియోగం !

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు దర్శకుడు సుకుమార్ తండ్రి తిరుపతి నాయుడు (82) బుధవారం ఉదయం 11 గంటలకు కన్నమూసారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.(వీరిలో చిన్నవాడు సుకుమార్)

తిరుపతి నాయుడు అంత్యక్రియలు గురువారం ఈస్ట్ గోదావరి జిల్లాలోని రాజోలు సమీపంలోని మట్టపర్రు గ్రామంలో జరుగనున్నాయి. తిరుపతి నాయుడు మరణంతో సుకుమార్ కుటుంబంలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు విషయం తెలిసిన వెంటనే సుకుమార్‌ను పరామర్శించారు.

 Sukumar's father passes away!
English summary
Tirupathi Rao Naidu (82), father of Sukumar (Director) passed away today at 11:00hrs. Mr. Naidu was suffering from ill health since few weeks.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu