»   »  ఎన్టీఆర్ ఇంట్లో లేట్ నైట్ పార్టీ

ఎన్టీఆర్ ఇంట్లో లేట్ నైట్ పార్టీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ, మాటలు, సంభాషణల్ని అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించిన ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌, హెబ్బాపటేల్‌ జంటగా కొత్త దర్శకుడు సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'కుమారి 21ఎఫ్‌' విడుదలై విజయవంతంగా ప్రదర్శితమౌతున్న నేపద్యంలో జూ ఎన్టీఆర్ ఇంట్లో పార్టీ జరిగింది.

ఈ పార్టీలో ఎన్టీఆర్ స్నేహితులు సుకుమార్ మరియు మ్యుజిక్ డైరక్టర్ దేవిశ్రీ , రత్నవేలు పాల్గోన్నారు. దీనికి సంబందించిన ఫోటోతో కూడిన ట్వీట్ ని కింద చూడండి.


Sukumar's Kumari Team Party @ NTR House


ఈ సినిమా విజయం సాదించినందకు ట్విట్టర్ ద్వారా గతంలో శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆడూరి నిర్మాతలు.

చిత్రం కథేమిటంటే...


సిద్దు(రాజ్ తరుణ్) బెస్ట్ ఫ్రెండ్స్ శంకర్(నోయెల్), ఫోటోల సురేష్(నవీన్), సొల్లు శీను(సుదర్శన్). ఫ్రెండ్స్ ముగ్గురూ ఎటిఎం దొంగతనాలు చేస్తూ బ్రతుకుతూంటే... హీరో వారికి సాయిం చేస్తూంటాడు. ఈ లోగా వారి కాలనీకి...కుమారి (హేబా పటేల్) వస్తుంది. ఆమె ఓ మోడల్. ఇప్పటి మెట్రో యూత్ కు ప్రతిబింబంగా ఉండే ఆమె ... మనస్సులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం, అందరితో సోషల్ గా మూవ్ అవటం చేస్తూంటుంది.


ఆమెతో తొలి చూపులోనే ప్రేమలో పడిపోయిన సిద్దు...ఆమె బోల్డ్ నెస్, స్పీడుగా దూసుకుపోయే గుణం, సోషల్ గా మూవ్ అవటం చూసి అనుమానిస్తాడు. అతని అనుమానానికి అతని స్నేహితులు ఆమె గురించి నెగిటివ్ గా మాట్లాడి ఆజ్యం పోస్తారు.


దానికి కారణం వారూ ఆమెపై కన్నేయటమే. ఈ క్రమంలో ఏం జరిగింది. అలాంటి వారితో స్నేహం చేసిన సిద్దుకు ఏం సమస్య వచ్చింది. చివరకు సిద్దు, కుమారీలు ఎలా ఒకటయ్యారు వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.English summary
DSP Tweeted "Thx 2 dear Jr NTR 4 inviting us home last nite n celebrating d Tremendous Success of KUMARI 21F".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu