»   » నాగచైతన్య నెక్ట్స్ చిత్రం గీతాఆర్ట్స్ లో...!?

నాగచైతన్య నెక్ట్స్ చిత్రం గీతాఆర్ట్స్ లో...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య తన తదుపరి చిత్రాన్ని గీతా ఆర్ట్స్ కి చేయనున్నట్లు సమాచారం. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందే అవకాశం ఉంది. మొదట ఈ చిత్రాన్ని వరణ్ సందేశ్, తమన్నా కాంబినేషన్ లో ప్లాన్ చేసారు. అయితే ఆ పెయిర్ కన్నా నాగచైతన్యతో ఆ కథ చేస్తే మరింత బావుంటుందనే నిర్ణయానికి వచ్చి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సుకుమార్,అల్లు అర్జున్ తో చేసిన ఆర్య 2 పరాజయం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కేరళలో మంచి ఫలితాన్ని ఇస్తూండటంతో రాష్ట్రంలో అనిశ్చితి వల్లే సినిమా వర్కవుట్ కాలేదని ఫైనల్ గా తేలుస్తున్నారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య,గౌతం మీనన్ కాంబినేషన్ లో రూపొందిన యేమి మాయ చేసేవే రిలీజుకు రెడీగా ఉంది. అలాగే నాగచైతన్య ప్రక్కన ఎవరిని తీసుకోవాలనే తర్జన భర్జనలు జరుగుతున్నాయి. తమన్నానే ఆఫ్షన్ గా సుకుమార్ సూచించినట్లు చెప్తున్నారు. బావా మరదళ్ళ మధ్య జరిగే కథగా ఈ చిత్రం రూపొందనుందని అంతర్గత వర్గాల సమాచారం. అలాగే నాగచైతన్య, అజయ్ భువన్ తో చేసే సినిమా సుకుమార్ అనంతరం చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ చిత్రం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి అని వినపడుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu