నాపైన బాస్ ఉంటేనే ఫాస్ట్‌గా చేస్తాను.. తెలంగాణ సాయుధ పోరాటంపై సినిమా.. సుకుమార్ కామెంట్స్

టాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ఎవరు? అని అడిగితే.. సుకుమార్ అంటూ టక్కున చెప్పేస్తారు. సినిమాల్లో ఎన్ని లాజిక్స్, లెక్కలు పెట్టినా సగటు మనిషి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్‌తో సినిమాను తెరకెక్కించడం సుకుమార్ శైలి. క్లాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సుకుమార్.. రంగస్థలంతో చిత్రంతో ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టి తనకు క్లాస్, మాస్ అనే తేడా లేదని నిరూపించుకున్నాడు. రంగస్థలం వచ్చి రెండేళ్లైనా మరో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాని సుకుమార్.. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించాడు. అవేంటో ఓ సారి చూద్దాం.

ఏడేళ్ల తరువాత వాడాను..

ఏడేళ్ల తరువాత వాడాను..

సుకుమార్ సోషల్ మీడియాను ఎక్కువగా వాడడన్న సంగతి తెలిసిందే. అయితే మొన్న రాజమౌళి విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ.. ఇంటి పనులను చేసిన వీడియోను షేర్ చేశాడు. ఇదే విషయాన్ని చెబుతూ.. ఏడేళ్ల అకౌంట్ అది అని, రాజమౌళి కోసమే ఆ వీడియో చేసి షేర్ చేశానని తెలిపాడు. ఇంత వరకు ఆ అకౌంట్‌ను తాను వాడలేదని తెలిపాడు.

సాయుధ పోరాటంపై సినిమా..

సాయుధ పోరాటంపై సినిమా..

ఒకప్పుడు ఎక్కువగా చదివేవాడినని తెలిపాడు. అయితే ప్రస్తుతం ఎక్కువ చూడటానికే ప్రాముఖ్యత ఇస్తున్నానని పేర్కొన్నాడు. అయితే ఈ మధ్య తెలంగాణ పోరాటం గురించి చదివానని అన్నాడు. రంగస్థలం తరువాత దానిపైనే సినిమా చేద్దామని అనుకున్నట్టుగా తెలిపాడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల అది పక్కకు జరిగిందన్నాడు.

నాపైనా బాస్ ఉంటేనే..

నాపైనా బాస్ ఉంటేనే..

సమయం ఇచ్చి ఓ పనిని పూర్తి చేయాలని చెబితే తాను కంగారు పడతానని తెలిపాడు. టైమ్ లిమిట్ పెడితే సరిగా ఆలోచించలేనని చెప్పుకొచ్చాడు. వేరు వారి కథలైతే తొందరగానే చేసేస్తానని అన్నాడు. తన సొంత కథల్లో మాత్రం ఎక్కువగా సమయం తీసుకుంటానని పేర్కొన్నాడు. తన మీదు ఎవరైనా బాస్ ఉంటే... త్వరత్వరగా పని చేస్తానని తెలిపాడు. అందుకే నాన్నకు ప్రేమతో, ఆర్య, 100 పర్సెంట్ లవ్ చాలా తొందరగా తీశానని అన్నాడు. బన్నీవాస్ చాలా తొందర పెట్టేవాడు.. అలా నన్ను పరిగెత్తించేందుకు ఓ బాస్ కావాలన్నాడు. డైరెక్టర్ అయ్యాక బాస్‌లా ప్రవర్తిస్తున్నా కూడా తనపై మరో బాస్ కావాలన్నాడు.

Recommended Video

Vijay Sethupathi Out From Allu Arjun's Pushpa Movie
క్యారెక్టర్ లుక్స్ పూర్తి..

క్యారెక్టర్ లుక్స్ పూర్తి..

పుష్ప సినిమా గురించి మాట్లాడుతూ.. మామూలుగా అయితే ఈ పాటికి షూటింగ్ జరుగుతూ ఉండాలన్నాడు. కరోనా వచ్చి మొత్తం మార్చేసిందని పేర్కొన్నాడు. కానీతామంతా హోమ్ వర్క్ చేస్తున్నామని తెలిపాడు. క్యారెక్టర్ లుక్స్, క్యాస్టూమ్స్, స్క్రీన్ ప్లేకు సంబంధించిన పనులు పూర్తయ్యాయని పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X