స్టైలీష్ స్టార్ అని ఇక మరిచిపోండి.. ‘పుష్ప’పై బన్నీ ఫ్యాన్స్‌కు సుకుమార్ షాక్
సుకుమార్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రాబోతోన్న పుష్ప సినిమా గురించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. నిన్నటి చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జానీ మాస్టర్, సుకుమార్ మాట్లాడిన మాటలు అందరనీ ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై అంచనాలు ఆకాశన్నంటేలా చేశాయి. అన్నింటికంటే ఎక్కువగా సుకుమార్ బన్నీ ఫ్యాన్స్‌కు ఇచ్చిన మాట, చెప్పిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి.
బోల్డ్ అవతారంతో షాకిస్తోన్న హీరోయిన్ మహేశ్వరి

శరవేగంగా..
ప్రస్తుతం సుకుమార్ పుష్ప పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆగస్ట్‌లొ సినిమా విడుదల అని ప్రకటించిన తరువాత మరింత స్పీడు పెంచేశారు. మొన్నటి వరకు తమిళ నాడులో సినిమా షూటింగ్ కానిచ్చారు. ఇప్పుడు కాస్త విరామం తీసుకున్నారు. ఈ షెడ్యూల్‌లో యాక్షన్, రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ షూట్ చేశారు.

గ్యాప్ ఇచ్చారు..
ఇక విరామం లేకుండా కంటిన్యూగా సినిమాను షూట్ చేస్తుండటంతో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు. తమ పెళ్లి రోజు కూడా ఉండటంతో షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడు బన్నీ. అలా ఆ గ్యాప్ వల్ల చావు కబురు చల్లగా ఈవెంట్‌లో కూడా సందడి చేశాడు అల్లు అర్జున్.

ప్రీ రిలీజ్ ఈవెంట్..
చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుకుమార్, జానీ మాస్టర్ పుష్ప గురించి మాట్లాడారు. అల్లు అర్జున్ యాక్టింగ్, యాస, డ్యాన్సులు ఇలా ప్రతీ ఒక్క అంశం గురించి మాట్లాడారు. దీంతో ఇప్పుడు పుష్ప ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. సోషల్ మీడియా మొత్తం పుష్ప గురించి మాట్లాడుకుంటోంది.

జానీ మాస్టర్ అలా..
జానీ మాస్టర్ మాట్లాడుతూ.. మొన్నీమధ్యే పుష్ప షూటింగ్‌లో పాల్గొన్నాను. ఏం డ్యాన్సులు చేశారు..ఏం యాక్టింగ్ చేశారు.. ఆ యాస మాత్రం వేరే లెవెల్.. ఇక బన్నీ బాబును ప్రపంచం మొత్తం చూడబోతోందంటూ పుష్పపై అంచనాలు పెంచేశాడు.

మరిచిపోండంటూ సుకుమార్..
ఇక సుకుమార్ మాట్లాడుతూ.. బన్నీని ఇక స్టైలీష్ స్టార్ అని మరిచిపోండి.. ఐకానికి మాస్టర్ అయిపోతాడంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకు మించి చెప్పలేను అంటూ పుష్పపై అంచనాలు రెట్టింపు చేసేశాడు. పుష్ప గురించి చెప్పొద్దంటూ బన్నీ సైగలు చేస్తూనే ఉన్నాడు.


Click it and Unblock the Notifications











