twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిట్టే కానీ...కలెక్షన్స్ అందరూ షేర్ చేసుకున్నాం

    By Srikanya
    |

    హైదరాబాద్ 2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, సోగ్గాడే చిన్నినాయినా, మరియు ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ నాలుగు సినిమాలకు హిట్ టాక్ వచ్చింది. ముఖ్యంగా సోగ్గాడే చిన్ని నాయినాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. దాంతో ప్రేక్షకులు ఈ నాలుగు సినిమాల్లో తమకు నచ్చిన సినిమాని ఎంచుకుని చూస్తున్నారు.

    ఓ రకంగా నాలుగు సినిమాలు హిట్టే కానీ కలెక్షన్స్ ని షేర్ చేసుకోవాల్సిన పరిస్ధితి ఈ నాలుగు సినిమాలకు ఏర్పడింది. అదే ఏ ఒక్క సినిమానో హిట్టై ఉంటే ఆ సినిమానే కలెక్షన్స్ మొత్తం ఎత్తుకుపోయేది. ఈ విషయం సంక్రాంతి దర్శకులు కలిసి చేసిన చిట్ చాట్ లోనూ వచ్చింది.

    డైరక్టర్స్ అందరినీ కలిసి చిట్ చాట్ నిర్వహించారు ఓ మీడియా హౌస్ వారు. ఈ సందర్బంగా జరిగిన మాటల్లో, బాక్స్ ఆఫీస్ కు సంబందించి ఆడియన్స్ దగ్గరనుండి వచ్చిన రిపోర్ట్స్, రెస్పాన్స్ గురించి వారి మాటల్లో చెప్పుకున్నారు.

     Sukumar, Srivaas, Kalyan Krishna and M.Gandi's Special Chit Chat

    డిక్టేటర్ డైరక్టర్ శ్రీవాస్ మాట్లడుతూ, సుమారు 15 శాతం ప్రి రిలీజే బిజినెస్ ని త్యాగం చెయ్యాల్సి వచ్చిందని, ఇది రెవిన్యూ జనరేట్ చెయ్యడంలో కోద్దిగా ఇబ్బంది కలిగిందని, అయినా కలెక్షన్స్ మాత్రం అందరూ షేర్ చేసుకున్నారని అన్నారు.

    మరో ప్రక్క సుకుమార్ మాత్రం... రాజమౌళికి ధ్యాంక్స్ తెలిపారు, దీనికి కారణంగా బాహుబలి సినిమాతో ఆడియన్స్ మళ్ళీ దియోటర్ వైపు మళ్ళించినందుకు. సంక్రాంతికి వచ్చిన నాలుగు సినిమాలు హిటే అవ్వడానికి చాన్స్ ఎర్పడటంలో ఇది మంచి కారణం అయ్యిందని తెలిపారు. ఇంచుమించు ఇదే బావాన్ని మిగిలిన ఇద్దరైన గాంధీ, కళ్యాన్ కృష్ణ తెలిపారు.

    English summary
    Director Sriwass, opined clash of four films has affected the revenue generation and 'Dictator' makers had to sacrifice 15% of the pre-release business. Even he says the collections were shared by all the four releases.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X