'100% లవ్‌'అనే టైటిల్ ఎందుకు పెట్టామంటే..సుకుమార్ వివరణ

By Srikanya

నా తొలి చిత్రం 'ఆర్య'లో ప్రేమంటేనే నిజం... అనే విషయాన్ని చెప్పాను. ఇందులో ప్రేమంటేనే వందశాతం అని చెప్పే ప్రయత్నం చేశాను. వందశాతం ప్రేమను తాకిన ఓ జంట కథే ఇది. అందుకే '100% లవ్‌' అనే పేరు పెట్టాం అన్నారు.నాగచైతన్య, తమన్నా కాంబినేషన్ లో రూపొందిన '100% లవ్‌'ఈ నెల 6న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.అలాగే ఫీల్‌ మై లవ్‌... అని 'ఆర్య'లో చెప్పా. లవ్‌ ఈజ్‌ గాన్‌... అంటూ 'ఆర్య-2'లో చెప్పా.

ఇందులో ప్రత్యేకంగా అలాంటి లాజిక్కులేమీ ఉండవు. నేరుగా సాగే కథ ఇది. భావోద్వేగాలు కూడా అదే తరహాలోఉంటాయి అన్నారు.ఇక ఈ చిత్రం సున్నితమైన అంశాలతో కూడుకొన్న ఒక సాధారణ ప్రేమకథ ఇది. ఇంజినీరింగ్‌ చదువుతున్న బావామరదలు మధ్య సాగే చిన్న చిన్న భావోద్వేగాలతో సాగుతుంది. వారి మధ్య ఉన్నది ప్రేమా? ఆకర్షణా? మరొకటా? అనేది సినిమా చూశాక మీకే తెలుస్తుంది అన్నారు. సమర్పణ: అల్లు అరవింద్, దర్శకత్వం: సుకుమార్, నిర్మాత: బన్నీ వాసు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఏడిద రాజా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X