ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడు రాజమౌళి నన్ను...: దర్సకుడు సుకుమార్
దర్శకుడు రాజమౌళిగారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన మొదట్నుంచీ కూడా నన్ను ఎంతో ప్రోత్సాహించేవారు. ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడు కూడా ఆయన మోరల్ సపోర్ట్ ఇచ్చేవారు. నేను ఎంత మంది ప్రశంసలు అందుకున్నా... రాజమౌళిగారు అందించే అభినందనలు నాకు ప్రత్యేకమైనవి అంటూ చెప్పుకొచ్చారు ప్రముఖ దర్సకుడు సుకుమార్. ఆయన తాజా చిత్రం '100% లవ్"హిట్ అవ్వడంతో 100% హ్యాపీగా వున్నారు. సినిమా విడుదలవ్వగానే అభినందనల ఫోన్‌కాల్స్‌తో బిజీ బిజీగా వున్నారాయన.ఈ సందర్భంగా కలిసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే ఈ సక్సెస్ అందుకోవటానికి ప్రధాన కారకులు అల్లు అరవింద్. ఆయన సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. తొలిచిత్రమైనా రాజీ లేకుండా ఈ చిత్రాన్ని నిర్మించిన బన్నీ వాసుకే ఈ చిత్ర విజయంలో మేజర్ క్రెడిట్ దక్కుతుంది అన్నారు. దేవిశ్రీ సంగీతం ఈ చిత్రాన్ని మ్యూజికల్‌గా హిట్‌గా నిలిపింది. కెమెరామాన్ వెంకట్‌ప్రసాద్, స్క్రీన్‌ప్లే రైటర్ హరిప్రసాద్, ఎడిటర్ కార్తీక శ్రీనివాస్, మాటల రచయిత రమేష్, రచనా సహకారం అందించిన శ్రీను, అర్జున్, కళాదర్శకుడు ప్రకాష్... ఇలా అందరూ ఈ విజయంలో ముఖ్య భూమిక పోషించారు అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











