సుకుమార్ తదుపరి చిత్రం మహేష్ బాబుతోనేనని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో చిత్రం నిర్మించడానికి పెద్ద నిర్మాత ప్రయత్నిస్తున్నారు. సుకుమార్ ఇప్పుడు అల్లు అర్జున్ తో ఆర్య 2 సినిమా తీస్తున్నారు. 2004 లో ఆర్య సినిమా సూపర్ హిట్ కావడంతో సుకుమార్ పెద్ద దర్శకుల జాబితాలో చేరిపోయారు. మధ్యల "జగడం" సినిమా ఫ్లాప్ కావడంతో చాలాకాలం సుకుమార్ వెలుగులోకి రాలేదు. ఇప్పుడు ఆర్య 2 లో ఆయన తన ప్రతిభను ప్రదర్శించబోతున్నారని పరిశ్రమ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. కాకినాడలో ఒక ట్యుటోరియల కాలేజీలో లెక్కల పంతులుగా పనిచేసిన బండ్రెడ్డి సుకుమార్ దిల్ సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చి అనతి కాలంలోనే టాలీవుడ్ లో టాప్ దర్శకుడైపోయారు.