Pushpa Thank you meet చంద్రబోస్‌కు సుకుమార్ పాదాభివందనం.. కాళ్ల నమస్కరిస్తూ ఎమోషనల్

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప చిత్రం దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్నది. ఈ చిత్రం భారీ రికార్డులను క్రియేట్ చేస్తున్న సందర్భంగా చిత్రయూనిట్ థ్యాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్, చంద్రబోస్, దేవీ శ్రీ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే..

మ్యూజిక్ కాదు మ్యాజిక్

మ్యూజిక్ కాదు మ్యాజిక్

పుష్ప సినిమాకు విషయంలో దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేయలేదు. ఓ మ్యాజిక్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో నెంబర్ 1 ఆల్బమ్‌గా చరిత్ర సృష్టించింది. ఈ దెబ్బతో దేవీ శ్రీ ప్రసాద్ ప్యాన్ వరల్డ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు అంటూ పొగడ్తలతో సుకుమార్ ముంచెత్తాడు. చంద్రబోసు, దేవీ శ్రీ ప్రసాద్ కలిస్తే వచ్చే అవుట్‌పుట్ వేరేలా ఉంటుంది అని సుకుమార్ చెప్పారు. వాళ్లిద్దరితో పనిచేయడం చాలా ఉత్సాహంగా ఉంటుంది అని సుకుమార్ చెప్పారు.

బోసు, దేవీకి థ్యాంక్స్ చెప్పను

బోసు, దేవీకి థ్యాంక్స్ చెప్పను

గీత రచయిత చంద్రబోస్ గురించి చెబుతూ.. బోసు గారు.. హీరోయిన్ పేరు ఏమింటి అడిగితే.. శ్రీవల్లి అన్నాను. దాంతో చూపే బంగారమాయేనా అని అన్నారు. ఐదు నిమిషాల్లోనే చూపే బంగారం మాయేనే అనే ట్యూన్ వచ్చింది. ఆ తర్వాత దేవీ గారు సామీ.. సామీ అన్నారు. ఆ పాట కూడా నిమిషాల్లోనే వచ్చేసింది. నీవు ఎలాంటి పరిస్థితుల్లో దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేశాడో నాకు తెలుసు. ఆ విషయాన్ని నేను చెప్పలేను. యూట్యూబ్‌లో వరల్డ్ నంబర్ వన్‌గా పాటలు నిలిచాయి. అందుకు నేను థ్యాంక్స్ చెప్పను. ఎందుకంటే మేము చాలా స్నేహితులం అని సుకుమార్ ఎమోషనల్ అయ్యారు.

ఊఊ పాట నాలుగేళ్ల క్రితమే

ఊఊ పాట నాలుగేళ్ల క్రితమే


నాలుగు సంవత్సరాల క్రితం ఊ అంటావా? ఊఊ అంటావా పాటను రాశారు. నేను దానిని మనకోసం ఉంచేయండి అని చెబితే ఆ పాటను అలాగే పెట్టేశాడు. ఇప్పుడు ఆ పాటను ఊఊ అంటూ హృదయానికి హత్తుకొంటున్నారు. సినిమా చూసిన తర్వాత అంటూ చంద్రబోసు గారిని వేదిక పైకి పిలిచి మాట్లాడటం మొదలపెట్టారు. నాకు కవిత్వం రాయడం వచ్చు. కానీ చంద్రబోసు స్పాంటేనిటికి, అక్షర జ్ఞానానికి, జ్ఞాపకశక్తిని గుర్తు చేసుకొంటే.. తప్పకుండా సిరివెన్నెల సీతారామశాస్త్రిని తలుచుకోవాలి. నేను ఇండస్ట్రీకి వస్తూ ఇద్దరిని చూడాలని అనుకొన్నాను. అందులో ఒక వ్యక్తి సీతారామశాస్త్రి అని సుకుమార్ తెలిపారు.

 చంద్రబోస్ కాళ్లకు నమస్కరించిన సుకుమార్

చంద్రబోస్ కాళ్లకు నమస్కరించిన సుకుమార్

సిరివెన్నెల తర్వాత ఎవరినో ఒకరిని వెతుక్కోవాలని అనుకొన్నాను. నాకు చంద్రబోసు దొరికారు. ఆయన జాపకశక్తి అమోఘం, నేను చంద్రబోసుతో ఎందుకు ట్రావెల్ చేస్తానంటే.. ఆయన టాలెంట్‌ను ఎంజాయ్ చేస్తుంటాం. 5 నిమిషాల్లో 10 ఆప్షన్లు చెబుతుంటారు. చంద్రబోస్‌తో పనిచేసేటప్పుడు నేను, దేవీ చాలా ఎంజాయ్ చేస్తుంటాం. అలాంటి వ్యక్తిని వేదిక మీదకు ఎందుకు పిలిచానంటే అంటూ చంద్రబోస్‌ పాదాలకు నమస్కరించారు. చంద్రబోస్ ప్రతిభకు పాదాభివందనం చేస్తున్నాను. ఆయన చాలా సాధారణంగా కనిపిస్తారు. కానీ ఆయన శక్తి, ప్రతిభ ఏమిటో చెప్పడానికే పకాళ్లకు నమస్కరించాను అని సుకుమార్ అన్నారు.

 బన్నీ రియల్ హీరో.. నా గాడ్

బన్నీ రియల్ హీరో.. నా గాడ్

బన్నీ గురించి మాట్లాడుతూ.. నీ గురించి ఎన్నిసార్లు చెప్పిన తక్కువే. నేను నీళ్లలో పడితే అందరూ తెప్ప మీద నుంచి చూస్తుంటే.. అల్లు అర్జున్ నీళ్లలోకి దూకి నన్ను పైకి లాగాడు. నన్ను రక్షించడానికి ప్రయత్నిస్తే.. నా స్వార్ధంతో అతడినే లాగేస్తున్నాను. అప్పుడు నీవే నాకు దేవుడివి అని అనుకొన్నాను. అతడు రియల్ హీరో అనిపించాడు. అల్లు అర్జున్ మాట్లాడితే.. ఆయన డెప్త్ తెలియదు. ఆయనలో గ్రేట్ ఫిలాసఫర్ ఉన్నాడు. లెక్చరర్‌ ఉద్యోగాన్ని వదిలేసి నేను ఆర్య తీసినప్పుడు... నేను ఏది చెబితే అది విన్నాడు. పుష్ప సినిమా షూట్ అప్పుడు ఆయన ఏం చెబితే అది విన్నాను అని సుకుమార్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X