ఆది ‘సుకుమారుడు’ ఫస్ట్‌లుక్ (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: లవ్లీ రాక్ స్టార్ ఆది హీరోగా, పిల్ల జమిందార్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన యువ దర్శకుడు అశోక్ జి. దర్శకత్వంలో శ్రీ సౌదామిని క్రియేషన్స్ పతాకంపై సీనియర్ ప్రొడ్యూసర్ కె.వి.వి.సత్యనారాయణ సమర్పణలో కె. వేణుగోపాల్ నిర్మిస్తున్న 'సుకుమారుడు' చిత్రం ఫస్ట్ లుక్ అఫీషియల్ గా రిలీజ్ చేసారు.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు కె.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ 'సుకుమారుడు ఫస్ట్ లుక్ విడుదల చేసాం. ఈ చిత్రానికి సంబంధించి ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. బ్యాలెన్స్ ఉన్న ఒక పాటను ఫిబ్రవరి 10 నుంచి ఐదు రోజుల పాటు ప్రత్యకంగా వేసిన సెట్స్ లో చిత్రీకరించడం జరుగుతుంది. దీంతో టోటల్ గా షూటింగ్ పూర్తవుతుంది. ఫిబ్రవరిలో ఆడియో రిలీజ్ చేసి మార్చిలో చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.
ఆది, అనూపర్ రూబెన్స్ కాంబినేషన్లో వచ్చిన గత రెండు చిత్రాల కంటే కూడా మా 'సుకుమారుడు' చిత్రం ఆడియో పరంగా పెద్ద హిట్ అవుతుందని గ్యారెంటీగా చెప్పగలను. ఆల్ మెస్ట్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న 60, 70 మంది ఆర్టిస్టులందరూ ఈచిత్రంలో నటిస్తున్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ, ఊర్వశి శారదగార్ల కాంబినేషన్లో వచ్చే సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. అలాగే కెమెరామెన్ శ్రీరామ్ అద్భుతమైన ఫోటోగ్రఫీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నిషా అగర్వాల్, భావన అందచందాలు ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అవుతాయన్నారు.

సుకుమారుడు ఫస్ట్ లుక్.

సుకుమారుడు మూవీ స్టిల్స్.

సుకుమారుడు మూవీ స్టిల్స్.

సుకుమారుడు మూవీ స్టిల్స్.

సుకుమారుడు మూవీ స్టిల్స్.

సుకుమారుడు మూవీ స్టిల్స్.
ఇప్పటి వరకూ డాన్స్‌లు, ఫైట్స్ తో మంచి పేరు తెచ్చుకున్న ఆది ఈచిత్రంతో మంచి పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకుంటాడు. ఫారిన్ లో చిత్రీకరించిన పాటలు కనుల విందుగా ఉంటాయి. అలాగే ఫైట్స్ మాస్టర్ రవివర్మ కంపోజ్ చేసిన మూడు ఫైట్లు ఫెంటాస్టిక్ గా వచ్చాయి. క్లైమాక్స్ ఫైట్ మైలవరంలో చిత్రీకరించాం. ఈ ఫైట్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది' అన్నారు.
లవ్ లీ రాక్ స్టార్ ఆది, నిషా అగర్వాల్, భావన ముఖ్య పాత్రలో ఊర్వశి శారద, ఓ ప్రత్యేక పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ నటిస్తున్న ఈ చిత్రంలో ఎం.ఎస్.నారాయణ, తనికెళ్ల భరణి, రావు రమేష్, చలపతిరావు, సంజయ్, తాగుబోతు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఫొటోగ్రఫీ: శ్రీరామ్, ఎడిటింగ్: ప్రదీప్, ఆర్ట్: రామ్, డాన్స్: జులాయి శేఖర్, కో ప్రొడ్యూసర్: బాబ్జీ, సమర్పణ: కె.వి.వి.సత్యనారాయణ, నిర్మాత: కె.వేణుగోపాల్, కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: అశోక్ జి.


Click it and Unblock the Notifications











