For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుకుమారుడు సెన్సార్ రిపోర్ట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: లవ్లీ రాక్ స్టార్ ఆది, నిషా అగర్వాల్ జంటగా, పిల్ల జమిందార్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన యువ దర్శకుడు అశోక్ జి. దర్శకత్వంలో శ్రీ సౌదామిని క్రియేషన్స్ పతాకంపై సీనియర్ ప్రొడ్యూసర్ కె.వి.వి.సత్యనారాయణ సమర్పణలో కె. వేణుగోపాల్ నిర్మిస్తున్న 'సుకుమారుడు' సెన్సార్ కార్యక్రమాను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు U/A సర్టిఫికెట్ జారీ చేసారు. మరో వైపు ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్స్‌కు మంచి స్పందన వస్తోంది. మే 10వ తేదీన ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    సుకుమారుడు సినిమా గురించి సమర్పకులు కె.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ ' ఆది సినిమాల్లోకెల్లా బెస్ట్ సినిమాగా ఈచిత్రం తెరకెక్కింది. ఇప్పటి వరకూ డాన్స్‌లు, ఫైట్స్ తో మంచి పేరు తెచ్చుకున్న ఆది ఈచిత్రంతో మంచి పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకుంటాడు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న 60, 70 మంది ఆర్టిస్టులందరూ ఈచిత్రంలో నటిస్తున్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ, ఊర్వశి శారదగార్ల కాంబినేషన్లో వచ్చే సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయి.

    అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం మంచి విజయం సాధించింది. అలాగే కెమెరామెన్ శ్రీరామ్ అద్భుతమైన ఫోటోగ్రఫీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నిషా అగర్వాల్, భావన అందచందాలు ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అవుతాయన్నారు. ఫైట్స్ మాస్టర్ రవివర్మ కంపోజ్ చేసిన మూడు ఫైట్లు ఫెంటాస్టిక్ గా వచ్చాయి. క్లైమాక్స్ ఫైట్ మైలవరంలో చిత్రీకరించాం. ఈ ఫైట్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది' అన్నారు.

    ఆది, నిషా అగర్వాల్, భావన ముఖ్య పాత్రలో ఊర్వశి శారద, ఓ ప్రత్యేక పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ నటిస్తున్న ఈ చిత్రంలో ఎం.ఎస్.నారాయణ, తనికెళ్ల భరణి, రావు రమేష్, చలపతిరావు, సంజయ్, తాగుబోతు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఫొటోగ్రఫీ: శ్రీరామ్, ఎడిటింగ్: ప్రదీప్, ఆర్ట్: రామ్, డాన్స్: జులాయి శేఖర్, కో ప్రొడ్యూసర్: బాబ్జీ, సమర్పణ: కె.వి.వి.సత్యనారాయణ, నిర్మాత: కె.వేణుగోపాల్, కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: అశోక్ జి.

    English summary
    Aadi, Nisha Agarwal starrer Sukumarudu directed by Ashok has completed censor formlities. The film was awarded U/A Certificate by censor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X