twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షూటింగులో గాయపడ్డ హీరో ఆది

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : లవ్‌లీ చిత్రం తర్వాత హీరో ఆది చేస్తున్న చిత్రం 'సుకుమారుడు'. ఇటీవల ఈచిత్రం షూటింగులో ఆది గాయ పడ్డట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తుండగా గ్లాస్ ప్రేమ్ అతని కుడి చేతిపై గాయమైనట్లు యూనిట్ వర్గాల సమాచారం. దీంతో షూటింగ్ మానేసి డబ్బింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు ఆది. జనవరి 8 నుంచి 'సుకుమారుడు' కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.

    యువ దర్శకుడు అశోక్ జి. దర్శకత్వంలో శ్రీ సౌదామిని క్రియేషన్స్ పతాకంపై సీనియర్ ప్రొడ్యూసర్ కె.వి.వి.సత్యనారాయణ సమర్పణలో కె. వేణుగోపాల్ 'సుకుమారుడు' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రేమకావాలి, లవ్ లీ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన ఆదికి ఇది మరో సూపర్ డూపర్ హిట్ సినిమా అవుతుందని, ఊర్వశి శారద కీలకమైన పాత్ర పోషిస్తున్న ఈచిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ గారు స్పెషల్ అప్పీయెరెన్స్ ఇవ్వడం మరో విశేషమని నిర్మాత తెలిపారు.

    ఆది, నిషా అగర్వాల్, భావన ముఖ్య పాత్రలో ఊర్వశి శారద, ఓ ప్రత్యేక పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ నటిస్తున్న ఈ చిత్రంలో ఎం.ఎస్.నారాయణ, తనికెళ్ల భరణి, రావు రమేష్, చలపతిరావు, సంజయ్, తాగుబోతు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఫొటోగ్రఫీ: శ్రీరామ్, ఎడిటింగ్: ప్రదీప్, ఆర్ట్: రామ్, డాన్స్: జులాయి శేఖర్, కో ప్రొడ్యూసర్: బాబ్జీ, సమర్పణ: కె.వి.వి.సత్యనారాయణ, నిర్మాత: కె.వేణుగోపాల్, కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: అశోక్ జి.

    English summary
    
 'Sukumarudu' movie star Aadi has suffered severe injury to his right hand fore arm while shooting for an action sequence. G. Ashok is the director of the film and K. Venu Gopal is the producer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X