Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఓ వైపు శ్రీయ వేశ్యగా...అదే రోజు ఆది ‘సుకుమారుడు’
హైదరాబాద్: లవ్లీ రాక్ స్టార్ ఆది హీరోగా, పిల్ల జమిందార్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన యువ దర్శకుడు అశోక్ జి. దర్శకత్వంలో శ్రీ సౌదామిని క్రియేషన్స్ పతాకంపై సీనియర్ ప్రొడ్యూసర్ కె.వి.వి.సత్యనారాయణ సమర్పణలో కె. వేణుగోపాల్ నిర్మిస్తున్న 'సుకుమారుడు' చిత్రం విడుదల తేదీ ఖారారైంది. మే 10వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే రోజు శ్రీయ వేశ్య పాత్రలో రూపొందుతున్న 'పవిత్ర' మూవీ విడుదల కానుంది.
సుకుమారుడు సినిమా గురించి సమర్పకులు కె.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ ' ఆది సినిమాల్లోకెల్లా బెస్ట్ సినిమాగా ఈచిత్రం తెరకెక్కింది. ఇప్పటి వరకూ డాన్స్లు, ఫైట్స్ తో మంచి పేరు తెచ్చుకున్న ఆది ఈచిత్రంతో మంచి పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకుంటాడు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న 60, 70 మంది ఆర్టిస్టులందరూ ఈచిత్రంలో నటిస్తున్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ, ఊర్వశి శారదగార్ల కాంబినేషన్లో వచ్చే సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం మంచి విజయం సాధించింది. అలాగే కెమెరామెన్ శ్రీరామ్ అద్భుతమైన ఫోటోగ్రఫీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నిషా అగర్వాల్, భావన అందచందాలు ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అవుతాయన్నారు. ఫైట్స్ మాస్టర్ రవివర్మ కంపోజ్ చేసిన మూడు ఫైట్లు ఫెంటాస్టిక్ గా వచ్చాయి. క్లైమాక్స్ ఫైట్ మైలవరంలో చిత్రీకరించాం. ఈ ఫైట్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది' అన్నారు.
లవ్ లీ రాక్ స్టార్ ఆది, నిషా అగర్వాల్, భావన ముఖ్య పాత్రలో ఊర్వశి శారద, ఓ ప్రత్యేక పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ నటిస్తున్న ఈ చిత్రంలో ఎం.ఎస్.నారాయణ, తనికెళ్ల భరణి, రావు రమేష్, చలపతిరావు, సంజయ్, తాగుబోతు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఫొటోగ్రఫీ: శ్రీరామ్, ఎడిటింగ్: ప్రదీప్, ఆర్ట్: రామ్, డాన్స్: జులాయి శేఖర్, కో ప్రొడ్యూసర్: బాబ్జీ, సమర్పణ: కె.వి.వి.సత్యనారాయణ, నిర్మాత: కె.వేణుగోపాల్, కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: అశోక్ జి.