చక్కని ఫ్యామిలీ మూవీ ‘సుకుమారుడు’

By Bojja Kumar

హైదరాబాద్: ప్రేమ కావాలి, లవ్ లీ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత హీరో ఆది నటిస్తున్న చిత్రం 'సుకుమారుడు'. శ్రీ సౌదామిని క్రియేషన్స్ పతాకంపై కె.వి.వి.సత్యనారాయణ సమర్పణలో జి.అశోక్ దర్శకత్వంలో వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆది, నిషాఅగర్వాల్ జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం 60 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది.

ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు కె.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా 54 మంది నటీనటులతో రూపొందిస్తున్న ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని, 15నుండి మూడో షెడ్యూల్ ప్రారంభిస్తామని, ఆది మూడో చిత్రాన్ని కూడా విజయవంతం చేయాలన్న తపనతో దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడని తెలిపారు.

అమెరికా నుంచి వచ్చిన మనవణ్ని చూసిన ఆ పెద్దాయనకు తన టీనేజ్‌ గుర్తుకొచ్చింది. పాశ్చాత్య సంస్కృతిలో పెరిగిన ఆ అబ్బాయికి తెలుగుదనాన్ని ఎలా రుచి చూపించారు? ఇక్కడి పద్ధతులకు ఆ అల్లరి కుర్రాడు అలవాటుపడ్డాడో లేదా అనే కాన్సెప్టుతో ఈ చిత్రం రూపొందుతోంది.

నీలం ఉపాధ్యాయ, సూపర్‌స్టార్ కృష్ణ, శారద, బ్రహ్మానందం, గొల్లపూడి మారుతీరావు, తనికెళ్ల భరణి, ఎమ్మెస్ నారాయణ, రావురమేష్, శ్రీనివాస్ అవసరాల, అజయ్, ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: సాయిశ్రీరామ్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, మాటలు: చంద్రశేఖర్ గుండిమెడ, నిర్మాత: కె.వేణుగోపాల్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశోక్ జి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X