పార్టీలో క్రేజీగా ప్రవర్తించిన సల్మాన్ ఖాన్ (ఫోటోస్)

By Bojja Kumar

ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం 'సుల్తాన్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సల్మాన్ కుస్తీ(వ్రెజ్లింగ్) క్రీడాకారుడిగా కనిపించబోతున్నాడు. రియల్ లైఫ్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన చివరి షూటింగ్ షెడ్యూల్ హర్యానాలోని రేవరి ప్రాంతంలో జరుగుతోంది.

నేటితో షూటింగ్ పూర్తి కావడంతో యూనిట్ సభ్యులంతా పార్టీ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ తన టిట్టర్లో పోస్టు చేసారు. ఈ పార్టీలో సల్మాన్ తో పాటు యూనిట్ సభ్యులు క్రేజీగా ప్రవర్తించారు. ఒకరినొకరు భుజాలపై ఎత్తుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. సల్మాన్ అయితే ఏకంగా ఇద్దరు వ్యక్తులను తన భుజాలపై ఎత్తుకోవడం గమనార్హం.

ఈ ఫోటోల గురించి దర్శకుడు వివరిస్తూ.... 'వ్రెజ్లింగ్ గేమ్.. షూటింగ్ ముగింపు పార్టీలో హింద్ కేసరి జగదీష్ కాలిరామన్ సుల్తాన్ ను తన భుజాలపై ఎత్తుకున్నారు. అనంతరం హింద్ కేసరి పల్విందర్ చీమా సుల్తాన్ ను ఎత్తుకున్నారు. ఫైనల్ గా సుల్తాన్ ఈ ఇద్దరి తన భుజాలపై ఎతుకున్నారు' అని తెలిపారు. సినిమాలో సల్మాన్ ఖాన్ శక్తివంతమైన వ్యక్తిగా కనిపించబోతున్నాడు అని చెప్పడానికి ఈ ఫోటోస్ పోస్టు చేసారు.

సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...సుల్తాన్ అలీ ఖాన్ అనే మల్లయోధుని పాత్రలో సల్మాన్ నటిస్తున్నారు. సల్లూభాయ్‌కు జోడిగా అనుష్క శర్మ నటిస్తుంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ సుల్తాన్‌ను భారీగా నిర్మిస్తుంది. ఈ మూవీ రంజాన్ కానుకగా జూలై 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సుల్తాన్ ముగింపు పార్టీ

సుల్తాన్ ముగింపు పార్టీ

సుల్తాన్ మూవీ ముగింపు సందర్భంగా యూనిట్ సభ్యులంతా పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా సల్మాన్ ఇలా భుజాలపైకి ఎక్కాడు.

సల్మాన్

సల్మాన్

సల్మాన్ తన బల ప్రదర్శన కోసం ఇలా ఇద్దరినీ తన భుజాలపై ఎత్తుకున్నాడు.

షూటింగ్ పూర్తి

షూటింగ్ పూర్తి

సుల్తాన్ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో ఇక పోస్టు ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయి.

సెల్పీ

సెల్పీ

యూనిట్ సభ్యులతో కలిసి సెల్ఫీ తీసుకుంటున్న సల్మాన్ ఖాన్.

రియల్ లైఫ్

రియల్ లైఫ్

మల్ల యోధుడు సుల్తాన్ అలీ ఖాన్ జీవితం ఆదారంగా సినిమా తెరకెక్కుతోంది.

భారీ అంచనాలు

భారీ అంచనాలు

ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మాస్ ఎంటర్టెనర్ గా ఈ సినిమా ఉంటుంది.

కండల వీరుడు

కండల వీరుడు

సల్మాన్ ఖాన్ కు ఇప్పటికే కండల వీరుడనే పేరుంది. ఈ సినిమాలో ఆయన పర్ ఫెక్ట్ లుక్ లో కనిపించబోతున్నాడు.

అనుష్క

అనుష్క

ఇందులో అనుష్క శర్మకూడా నటిస్తోంది. ఆమె కూడా రెజ్లింగ్ క్రీడాకారిణిగా నటిస్తోంది.

ఈద్ రిలీజ్

ఈద్ రిలీజ్

ఈ మూవీ రంజాన్ కానుకగా జూలై 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X