మహర్షి ఈవెంట్‌లో సుమ ఏమైపోయింది.. ప్రశ్నల వర్షంతో ఎట్టకేలకు సమాధానం!

Recommended Video

Suma Reacts On Why She Suddenly Left From Maharshi Pre-release Event

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో బుధవారం రోజు ఘనంగా జరిగింది. వరుస విజయాలతో రాణిస్తున్న వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేష్ 25వ చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని దిల్ రాజు, అశ్విని దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విక్టరీ వెంకటేష్, విజయ్ దేవరకొండ, కొరటాల శివ, అనిల్ రావిపూడి లాంటి ప్రముఖుల అతిథులుగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ మధ్యలో సుమ కనిపించకుండా పోయారు. అందుకు గల కారణాన్ని సుమ తాజాగా వివరించారు.

కుర్ర యాంకర్లకు

కుర్ర యాంకర్లకు

చాలా ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో సుమ యాంకర్ గా దూసుకుపోతోంది. ఎంతమంది కుర్ర యాంకర్లు వచ్చినా సుమ జోరుని అందుకోలేకపోతున్నారు. మహిళలకు బాగా నచ్చే టివి షోలన్నింటిలో సుమనే కనిపిస్తూ ఉంటుంది. సినిమాకు సంబంధించి ఏ ఈవెంట్ జరిగినా ఎక్కువగా సుమకే యాంకరింగ్ అవకాశాలు వస్తుంటాయి. సందర్భోచితంగా మాట్లాడడంలో తనకు తానే సాటి అని సుమ నిరూపించుకుంది.

మహర్షి ఈవెంట్

మహర్షి ఈవెంట్

ఇటీవల సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు కూడా సుమనే వ్యాఖ్యాతగా వ్యవహరించింది. కానీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో సుమ సడెన్ గా మాయమైపోయింది. సుమ స్థానంలో మరో యాంకర్ తో కార్యక్రమాన్ని కొనసాగించారు. సుమ ఈవెంట్ నుంచి ఎందుకు మధ్యలో వెళ్ళిపోయింది అంటూ అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.

స్పందించిన సుమ

స్పందించిన సుమ

సోషల్ మీడియాలో సుమకు అభిమానుల నుంచి ప్రశ్నల వర్షం దురవుతుండడంతో మహర్షి ఈవెంట్ గురించి స్పందించింది. నేను మహర్షి ఈవెంట్ నుంచి ఎందుకు సడెన్ గా వెళ్లిపోయానని చాలామంది అడుగుతున్నారు. ఆ సమయంలో నేను వేరే ఊరికి ప్రయాణించాల్సి వచ్చింది. విమానాన్ని అందుకునేందుకు మధ్యలో వెళ్ళవలసి వచ్చిందని సుమ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

 వివాదాల జోలికి

వివాదాల జోలికి

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యాంకర్లు గ్లామరస్ గా కనిపించేందుకు ఇష్టపడతారు. పలు వివాదాల్లో నిలుస్తుంటారు. కానీ సుమ అవేమి లేకుండానే టాప్ యాంకర్ గా ఎదిగారు. రష్మిక, అనసూయ, శ్రీముఖి లాంటి యంగ్ యాంకర్లకు సుమ పోటీగా నిలుస్తున్నారు. సుమ భర్త రాజీవ్ కనకాల టాలీవుడ్ లో నటుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X