Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అందరూ కలిసి స్టేజ్ మీదే ఉతికేశారు.. బాబా భాస్కర్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు!
బాబా భాస్కర్ ఎక్కడుంటే అక్కడంతా సందడి వాతావరణమే. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు వంద రోజులకు పైగా బిగ్ బాస్ ఇంట్లో బాబా భాస్కర్ చేసిన అల్లరిని అందరూ చూసే ఉంటారు. మూడో సీజన్ బిగ్ బాస్ షోకు బాబా భాస్కర్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ను ఎవ్వరూ అంత ఈజీగా మరిచిపోలేరు. అయితే బాబా భాస్కర్ ఎప్పుడూ కూడా ఎదుటివారిని నవ్వించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాడు.
Recommended Video
ప్రతీ షోలోనూ..
బాబా భాస్కర్ కనిపించే ప్రతీ షోలోనూ కామెడీకి కొదవ ఉండదు. అది డ్యాన్స్ షో అయినా పండుగలకు వచ్చే స్పెషల్ ఈవెంట్లు అయినా కూడా సరే బాబా భాస్కర్ ఉంటే ఆ సందడే వేరు. ఎదుట ఎవరు ఉన్నారని చూడకుండా సెటైర్లు, పంచ్‌లు వేస్తూ నవ్విస్తుంటాడు.
డ్యాన్స్ ప్లస్ షోలో..
ప్రస్తుతం బాబా భాస్కర్ డ్యాన్స్ ప్లస్ షోలో సందడి చేస్తున్నాడు. ఆరుగురు జడ్జ్లో బాబా భాస్కర్ ఒకడు. ఇక తనదైన శైలిలో జడ్జ్ మెంట్ ఇస్తూ నవ్వులు పూయిస్తుంటాడు. మధ్యమధ్యలో వచ్చి తన స్టైల్లో మాస్ స్టెప్పులు వేసి అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటాడు.
తాజాగా అలా..
తాజాగా బాబా భాస్కర్, యానీ మాస్టర్ గ్యాంగ్‌లు సుమ స్టార్ట్ మ్యూజిక్ షోలో పాల్గొన్నారు. వీరితో పాటు రఘు మాస్టర్ కూడా వచ్చేశాడు. మామూలుగానే సుమ, యానీ మాస్టర్లను బాబా భాస్కర్ ఓ ఆట ఆడేసుకుంటుంటాడు. తాజాగా ఈ షోలోనూ దుమ్ములేపినట్టు కనిపిస్తోంది.
ప్రోమో వైరల్..
వచ్చే ఆదివారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. వయసు మీద, ముడతల మీద సుమ, యానీ మాస్టర్, బాబా భాస్కర్లు ఒకరి మీద మరొకరు పంచ్‌లు వేసుకున్నారు. బాబా భాస్కర్ గడ్డాన్ని బోళ్లు తోమే పీచుగా అభివర్ణించింది సుమ.
స్టేజ్ మీదే ఉతికేశారు..
ఇక బాబా భాస్కర్ చేస్తోన్న కామెంట్లు,వేసిన పంచ్‌లు శ్రుతి మించడంతో సుమ, యానీ మాస్టర్ కలిసి బాబా భాస్కర్‌ను స్టేజ్ మీదే ఉతికేశారు. కిందపడి మరీ కొట్టేశారు. మొత్తంగా బాబా భాస్కర్ రాకతో షో మొత్తం నవ్వులు పూయించినట్టు కనిపిస్తోంది.