For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భీమ్లా ఈవెంట్ కి రాకుండా బండ్లపై కుట్ర.. లైవ్ లో లీక్ చేసిన సుమ?

    |

    భీమానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో బండ్ల గణేష్ ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఎవరో ఒక అభిమాని మీరు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తున్నారా లేదా అని అడిగితే బండ్ల గణేష్ దర్శకుడు త్రివిక్రమ్ పేరు చెబుతూ నన్ను ఈవెంట్ కు రానివ్వడం లేదు అంటూ చేసిన కామెంట్లు అప్పట్లో వైరల్ గా మారాయి. అయితే ఆ తర్వాత ఈ వ్యవహారం మరుగున పడింది అనుకుంటే తాజాగా ఎఫ్3 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో సుమ ఈ వ్యవహారాన్ని మరోసారి తెరమీదకు తీసుకు వస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఆ వివరాల్లోకి వెళితే

    సీక్వెల్

    సీక్వెల్

    వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ అందుకుంది ఎఫ్ 2 సినిమా. భార్యా బాధితుల కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించడంతో అప్పట్లోనే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తామని ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా సీక్వెల్ ఎఫ్ 3 సిద్ధం చేశారు.

    ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా

    ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా

    ఈ సినిమాలో వరుణ్ తేజ్ వెంకటేష్. తమన్నా, మెహరీన్, ప్రగతి, ప్రదీప్ వంటి వారు మాత్రమే కాక రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్, పూజా హెగ్డే వంటివారు ఇతర కీలక పాత్రల్లో భాగమయ్యారు. మే 27వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్న క్రమంలో ఒక వారం ముందు అంటే ఇరవై ఒకటో తేదీనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ హోస్ట్ గా వ్యవహరించింది.

    కుట్ర వ్యవహారాన్ని బయట పెట్టి

    కుట్ర వ్యవహారాన్ని బయట పెట్టి

    ఆమె హోస్ట్ గా వ్యవహరించిన సమయంలోనే ఈ బండ్ల గణేష్ భీమ్లా నాయక్ కుట్ర వ్యవహారాన్ని బయట పెట్టింది. పూర్తిస్థాయి తెలంగాణ యాస లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతా నడిపించిన సుమ భీమానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బండ్ల గణేష్ గారిని ఎలా అయితే వెళ్లకుండా కుట్ర చేశారో తనను కూడా ఎఫ్ త్రీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్ళకుండా చేశారు అంటూ ఆమె ఆరోపించింది.

    కుట్ర చేశారు అంటూ

    కుట్ర చేశారు అంటూ

    అయితే బండ్ల గణేష్ చెప్పినప్పుడు కామెడీ గా తీసుకున్నారు కానీ ఇప్పుడు సుమ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడంతో ఈ అంశం మీద మరోసారి చర్చ జరుగుతోంది. బండ్ల గణేష్ కు పవన్ కళ్యాణ్ వీరాభిమాని అనే పేరుంది అలాంటి ఆయనను భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దర్శకుడు త్రివిక్రమ్ రాకుండా కుట్ర చేశారు అంటూ స్వయంగా ఆయనే ఆరోపించాడు ఆ తర్వాత ఈ విషయం మీద సైలెన్స్ పాటించాడు.

    బండ్ల గణేష్ షేర్ చేయడంతో

    బండ్ల గణేష్ షేర్ చేయడంతో

    కానీ తాజాగా సుమ మాట్లాడిన మాటలు వీడియో ను సైతం బండ్ల గణేష్ షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాకు శేఖర్ చంద్ర దర్శకుడి గా వ్యవహరించగా కథ స్క్రీన్ ప్లే వంటి విషయాలలో మాత్రం త్రివిక్రమ్ శ్రద్ధ తీసుకున్నాడు. అయితే త్రివిక్రమ్ కూడా ఈ వేడుకకు కాస్త దూరంగానే కనిపించారు కానీ బండ్ల గణేష్ వ్యవహారం మాత్రం హాట్ టాపిక్ అయింది.

    English summary
    Suma made intresting comments on bandla ganesh entry denial to bheemla nayak pre release event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X