Bubblegum Teaser: అర్జున్ రెడ్డిని మించిన రొమాన్స్! యాంకర్ సుమ కొడుకు సినిమా టీజర్ చూశారా?
Bubblegum Teaser: యాంకర్ సుమ కనకాల, నటుడు రాజీవ్ కనకాల కుమారుడు హీరోగా పరిచయమైన తాజా చిత్రం బబుల్ గమ్. రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మానస చౌదరి హీరోయిన్ గా నటించింది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో సుమ కుమారుడు రోషన్.. అదిరిపోయే లుక్ లో కనిపించాడు. అర్జున్ రెడ్డిని మించి రొమాన్స్ చేస్తూ చెలరేగిపోయాడు. తల్లిదండ్రుల నటనా నైపుణ్యాన్ని పుణికి పుచ్చుకొని యాక్టింగ్ చేసినట్లుగా అనిపిస్తోంది.
ప్రోమో స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అవ్వడమే.. బయగాన్ లో ప్యార్... బబుల్ గమ్ లాంటిది. స్టార్టింగ్ ల తియ్యగుంటది. కానీ తర్వాత అంటుకుంది. షూస్ కింద, థియేటర్లల్ల సీట్ల కింద, అంత ఈజీ కాదురరేయ్.. పండవట్టేస్తది అంటూ వాయిస్ ఓవర్ చూస్తుంటేనే సినిమా ఎలా ఉండబోతుందో అర్థం అయిపోతుంది. ఆ తర్వాత హీరో ఎంట్రీ, చదువుకొని ఉద్యోగం తెచ్చుకోకపోతే నాలాగా బొక్కలు కొట్టుకుంట కూసోవాలని అనే చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ఆ తర్వాత రోషన్ కొనకాల చికెన్ సెంటర్లో మొహం చిరాకుగా పెట్టుకొని ముక్కలు కొడుతూ కనిపిస్తాడు.

పళ్లు తోముకోకపోయినా కిస్ చేస్త..!:ఇక ఆ తర్వాత పబ్ లో డీజేగా స్టైలిష్ లుక్కులో కనిపించాడు. అక్కడే అతడు హీరోయిన్ ను చూడడం, ఆమె అందానికి ఫిదా అయిపోవడం కనిపిస్తుంది. ఆ తర్వాత వారి పరిచయం, ప్రేమను చూపించారు. రోషన్ హీరోయిన్ కు ప్రపోజ్ చేసేటప్పుడు చెప్పే డైలాగ్ అయితే యూత్ కు బాగా నచ్చేస్తుంది. పికప్ చేస్త, డ్రాప్ చేస్త, పళ్లు తోముకోకపోయినా కిస్ చేస్తా అని చెప్పగానే హీరోయిన్ నవ్వడం.. ఆ తర్వాత వీరిద్దరూ హగ్ చేసుకోవడం చూడొచ్చు.
బీచ్ ఒడ్డున రోషన్, మానసల లిప్ లాక్ సీన్:ఆ తర్వాత హీరోయిన్ పుట్టిన రోజు వేడుకలకు వెళ్లలేక, గిఫ్టు ఇచ్చేందుకు డబ్బులు లేక హీరో అవస్థ పడినట్లు కనిపిస్తోంది. కానీ చివరలో బీచ్ ఒడ్డున హీరోహీరోయిన్లు లిప్ లాక్ చేసుకుంటూ వచ్చే సీన్ చూస్తుంటే మాత్రం.. అర్జున్ రెడ్డి సినిమానే గుర్తుకు వస్తుంది అందరికీ. రోషన్ కనకాల ఈ సినిమాలో పాత్రకు బాగా సెట్ అయ్యాడు.

ఇటీవలే రిలీజైన టైటిల్ పోస్టర్..:పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు మహేశ్వరి మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను.. దర్శకధీరుడు రాజమౌళి ఇటీవలే రిలీజ్ చేశారు. ఫస్ట్ పోస్టర్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అందులో కూడా హీరోహీరోయిన్లు చాలా రొమాంటిక్ గా కనిపించారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టు అయి ఎంత మేర కలెక్షన్లను సాధిస్తుందో.


Click it and Unblock the Notifications











