సీనియర్ నటి సుమలత...రీ ఎంట్రి
చిరంజీవి సరసన శుభలేఖ", 'ఖైదీ" వంటి చిత్రాలు, అలాగే 'శ్రుతిలయలు" వంటి సంగీత భరత చిత్రం ద్వారా ప్రేక్షకులకు గుర్తుండిపోయే సుమలత తొలిసారిగా బుల్లితెరపై కనిపించబోతోంది. 'బతుకు జట్కాబండి" పేరుతో 'జీ తెలుగు" చానల్ ప్రసారం చేసే ఓ సామాజిక కార్యక్రమానికి సుమలత వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ...నేను టీవీ సీరియల్స్, రియాల్టి షోలు చూడను. అయితే ఈ పోగ్రాం సామాన్య వ్యక్తులు, వారి భాదలుకు సంభందించింది...అలాగే ఈ పోగ్రాం మైండిలెస్ ఎంటర్టైనర్ కాదు అందుకే ఒప్పుకున్నాను అంటోంది. ఇక ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్ ను వివాహం చేసుకున్నాక దాదాపుగా సినిమాలకు స్వస్తి చెప్పిన సుమలత బుల్లితెరపై కనిపించనుండడం ఆమె అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. ఇక సుమలత త్వరలో అమితాబ్ తో కలిసి ఓ మళయాళ చిత్రంలో కనపించనున్నారు.
చిరంజీవి కె విశ్వనాధ్ సుమలత బతుకు జట్కా బండి అంబరీష్ శుభలేఖ ఖైదీ శ్రుతిలయలు chiranjeevi k vishwanath sumalatha batuku jatka bandi subhalekha kaidhi sruthilayalu


Click it and Unblock the Notifications