ఎఫైర్: ఆమె కూతురు లాంటిది, తప్పుగా ఆలోచించొద్దు!
హైదరాబాద్: కన్నడ సినీ నటుడు అంబరీష్ ఓ అమ్మాయిని ముద్దాడుతున్న ఫోటో ఒకటి కన్నడ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తలను అంబరీష్ భార్య, సినీ నటి సుమలత ఖండించారు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి గురించిన పూర్తి వివరాలు ఆమె బయట పెట్టారు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు వైభవి అని, తమ ఫ్యామిలీ ఫ్రెండ్, యాక్టర్ జైజగదీష్-విజయలక్ష్మి దంపతుల కూతురని తెలిపారు.
వైభవిని అంబరీష్ సొంత కూతురులా చూసుకుంటారు. కొన్ని నెలల క్రితం తామంతా తమ నివాసంలో కలిసామని, ఆ సమయంలో తీసిన ఫోటోయే అది అని ఆమె తెలిపారు. ఆ ఫోటో తమ ఇంట్లోదే అనడానికి బ్యాగ్రౌండ్లో తమ ఫోటో కూడా ఉందని ఆమె స్పష్టం చేసారు. రాజకీయ లబ్ది కోసం ఈ ఫోటోతో అనవసర రాద్దాంతం చేయొద్దని సుమలత స్పష్టం చేసారు.

ఈ వార్తలతో వైభవి చాలా అప్ సెట్ అయిందని, వ్యక్తిగత వ్యవహారాలను ఇలా రచ్చకీడ్చడం సరికాదని సుమలత అన్నారు. వైభవి చిన్నతనం నుండి తమ చేతుల మీదుగా పెరిగిందని, ఆమె తమ కూతురు లాంటిదని సుమలత నొక్కి చెప్పారు.


Click it and Unblock the Notifications











