సుమన్ ‘గబ్బర్’ ఫస్ట్‌లుక్ (ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్: తెలుగు నటుడు సుమన్ తొలిసారిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'గబ్బర్'. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన సుమన్ లుక్ విడుదలైంది. ఈ స్టిల్ చూస్తుంటే ఇందులో ఆయన మెయిన్ విలన్ గా కనిపించనున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు.

అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంజయ్ లీలా బన్సాలీ రూపొందిస్తున్నారు. తమిళ చిత్రం 'రమణ'(తెలుగులో ఠాగూర్) చిత్రాన్ని హిందీలో 'గబ్బర్' పేరుతో రీమేక్ చేస్తున్నారు. 'వేదం', 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రాలకు దర్శకత్వం వహించిన తెలుగు దర్శకుడు క్రిష్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హబీబ్ ఖాన్ ఈచిత్రానికి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

Suman and Akshay Kumar on the sets of Gabbar

'శివాజీ' చిత్రం తర్వాత చాలా అవకాశాలు వచ్చినప్పటికీ చిత్రాల ఎంపికలో జాగ్రత్తగా ఉన్నట్లు సుమన్ చెప్పారు. 'గబ్బర్'లో నన్ను రికమండ్ చేసింది అక్షయ్ కుమార్. ఆయనకు ఈ సందర్భంగా కృజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాలీవుడ్ తెరంగ్రేటం ఆలస్యమైనప్పటికీ ఒక మంచి సినిమా ద్వారా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. ఇది నా కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు సుమన్ .

హిందీ చిత్రాల్లో అవకాశం వచ్చినప్పటికీ అన్ని భాషల చిత్రాల్లో నటిస్తాను అని సుమన్ పేర్కొన్నారు. త్వరలో హాలీవుడ్ సినిమాలో కూడా నటించబోతున్నాను. త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తాను అన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను సుమన్ ఖండించారు. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడం లేదు. భవిష్యత్‌లో ఒక జాతీయ పార్టీలో చేరుతానని సుమన్ వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X