‘ఒక ఐడియా తన జీవితాన్నే మార్చేసింది’: సుమన్
రజనీకాంత్ హీరోగా సుమన్ విలన్ గా నటించిన సినిమా 'శివాజీ" సుమన్ కెరీర్ నే మార్చేసింది. ఇది రజనీకాంత్ సినిమా కావడంతో దేశవిదేశాల్లో విడుదలై రజనీ అభిమానులను అలరించడమే కాకుండా హాలీవుడ్ నిర్మాతల దష్టిని ఆకర్షించింది. శివాజీలో విలన్ గా నటించిన హ్యాండ్ సమ్ హీరో ప్రేక్షకులల్లో మంచి గుర్తింపు తెచ్చుకొన్న సుమన్ ఇప్పుడు విలన్ గా మారనున్నాడు. అందుకు నాంది అయిన చిత్రం 'శివాజీ". ఈ చిత్రంలో తన ప్రతిభకు 2008 సంవత్సరానికి తమిళ రాష్ట్ర ప్రభుత్వం సుమన్ ను ఉత్తమ విలన్ గా ఎంపికచేసింది.
ఇటు విలన్ గా అటు క్యారెక్టర్ నటుడిగా బిజీగా ఉన్న సుమన్ ని ఆనందపరుస్తూ మరో సంఘటన జరిగింది. ఒక హాలీవుడ్ నిర్మాత సుమన్ కి పోన్ చేసి తమ సినిమాలో నటించమని అడిగారట. ఈ ఫోన్ కాల్ సుమన్ ని ఎగ్జయిటింగ్ కి గురి చేసింది. ఈ హాలీవుడ్ సినిమాకి సంబంధించిన వివరాలను త్వరలో సుమన్ స్వయంగా ప్రకటించాలనుకుంటున్నాడు. మొత్తానికి టాలీవుడ్ హీరో హాలీవుడ్ నటుడైతే ఎవరికైనా ఆనందమే కదా.


Click it and Unblock the Notifications











