twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షూటింగ్‌‌లో రజనీకాంత్‌ అందించిన సహకారం మరవలేను

    By Srikanya
    |

    నిడదవోలు: తమిళంలో శివాజీ చిత్రం మంచి గుర్తింపు తెచ్చిందని, ఈ చిత్ర షూటింగ్‌ సమయంలో రజనీకాంత్‌ అదించిన సహకారం నేటికి మరువలేనని ప్రముఖ సినీ నటుడు సుమన్‌ అన్నారు. తాను నటించిన శివాజీ చిత్రం ద్వారా నల్లధనంపై ప్రజలను ఆలోచింపచేశానని, అలాగే ప్రస్తుతం వైద్యసీట్లు, ఇంజినీరింగ్‌ సీట్లు వంటివి అమ్మకాలు జరిగి సమర్థులకు అవకాశం దక్కడం లేదన్నారు. వాటిపై కూడా ప్రజలను ఆలోచింప చేసే విభిన్న పాత్రలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

    ప్రజలను ఆలోచింపచేసే పాత్రలతో పాటు ప్రజలను చైతన్యవంతులను చేసే పాత్రలకే రానున్న రోజుల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అన్నారు. తెలుగులో ప్రస్తుతం మూడు చిత్రాలకు అవకాశాలు ఉన్నాయని అయితే పైన చెప్పిన పాత్రల కోసం ఎదురు చూస్తున్నానన్నారు. తాను చివరి వరకు సినిమారంగంలోనే ఉంటానని, రాజకీయాల్లోకి వచ్చే అవకాశం మాత్రం లేదన్నారు.

    అయితే రైతులు సంక్షేమం కోసం నిజంగా కృషి చేసే పార్టీలకు నా మద్దతు ఉంటుందన్నారు. అంటే ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు నష్టపోయిన సమయంలో వారిని అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. అలాగే రైతుల సంక్షేమానికి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలన్నారు.

    నటునిగా గుర్తించి ప్రేక్షకులు తనను ఎంతగానో ఆదరిస్తున్నారన్నారు. తాను ఇంతవరకు ఐదు భాషల్లో మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించానని వాటిలో సుమారు 100 వవరకు తెలుగు చిత్రాలు ఉన్నాయన్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో నటిస్తున్నానన్నారు. అలాగే హిరోగా ఇంతవరకు 99 చిత్రాల్లో నటించానని, 100వ చిత్రాన్ని ఈ నెలాఖరుకు ప్రారంభించే అవకాశం ఉందన్నారు.

    తాను తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చే నాటికి తనకు తెలుగు భాష అసలు రాదని అయితే తెలుగు ప్రజల ఆదరాభిమానాలతో ప్రస్తుతం తెలుగు పూర్తిగా మాట్లాడగల్గుతున్నానన్నారు. తాను పుట్టింది, పెరిగింది మద్రాసులోనే నన్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డానన్నారు. తాను చిత్రపరిశ్రమలోకి రావడానికి తమిళనాడుకు చెందిన కిట్టు కారణమన్నారు.

    36 ఏళ్ల కిందట సాధారణ కుటుంబానికి చెందిన తనను నిర్మాత టి.ఆర్‌.రామన్నకు పరిచయం చేసి నాకు ధైర్యానిచ్చి నా అభివృద్ధికి ఆయన చేసిన కృషి కారణంగానే తాను నటుడినై ఇంతమంది ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందగల్గుతున్నానన్నారు. దేవుని పాత్రల్లో అన్నమయ్య చిత్రంలో చేసిన వెంకటేశ్వరస్వామి పాత్రకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఈ చిత్రాన్ని అనాటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌శర్మతో కలిసి రాష్ట్రపతి భవన్‌లో చూడగల్గే అవకాశం దక్కిందన్నారు.

    దేవుడి పాత్రల నటనలో ఎన్టీఆర్‌ తరువాత అంత గుర్తింపు తనకు వచ్చిందని భావిస్తున్నానన్నారు. అయితే ఇటీవల ప్రకటించిన అవార్డుల ఎంపికలో ఆ పాత్రకు అవార్డు రాకపోవడం బాధించిందన్నారు. దేవుని పాత్రల్లో నటించే అవకాశం రావడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. దేవుడి పాత్రల్లో నటించే సమయంలో తాను చాలా నిష్టగా ఉండి 8 నెలల పాటు నేలపై పడుకుని, తెల్లవారుజామున 3 గంటలకు లేచే వాడినన్నారు. ఈ రోజుల్లో మాంసాహారం కూడా పూర్తిగా మానివేశానన్నారు.

    శ్రీరామదాసులో శ్రీరాముడి పాత్రకు కూడా అదేస్థాయి గుర్తింపు వచ్చిందన్నారు. 1993లో బావాబావమరిది చిత్రానికి ఉత్తమ నటుడు అవార్డు వచ్చిందన్నారు. తనది సాధారణ కుటుంబమని తాను ఈస్థాయికి రావడానికి ప్రేక్షకుల కృషి కూడా ఎంతో ఉందన్నారు. బీసీ కులానికి చెందిన తాను వారి సంక్షేమానికి ముందుండి పోరాడతానన్నారు. ఆయన వెంట అడబాల అశోక్‌, లాల్‌బహుదూర్‌, కారింకి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

    English summary
    Actor Suman thanks to Rajinikanth for sivaji Film. He says Rajini is very much helpful person.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X