రజనీ శివాజీలో విలన్‌గా సుమన్!
రజనీకాంత్ శివాజీలో సుమన్ విలన్‌గా నటించనున్నట్టు తెలిసింది. గత ఏడాది వరకు గ్రహస్ధితి బాగుండక అవకాశాలు కరువైన సుమన్‌కు నాగార్జున శ్రీ రామదాసు చిత్రంలో రాముడి పాత్ర లభించిన తర్వాత అవకాశాలు బాగా వస్తున్నాయి. శివాజీ సినిమాను ఎవిఎం సంస్ధ శంకర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా హీరోయిన్ కోసం భారీ అన్వేషణ జరిగింది. ఐశ్వర్యారాయ్ నుంచి త్రిష వరకు సంప్రదించి, చివరికి తమ షరతులకు ఒప్పుకున్న శ్రీయను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా పూర్తయ్యే వరకు శ్రీయ మరో సినిమాలో నటించడానికి వీల్లేదు. గతంలో శంకర్ అపరిచితుడు సినిమాను ఏడాది పాటు షూట్ చేశారు. శివాజీ సినిమా చిత్రీకరణ కూడా దాదాపు అంతకాలం తీసుకుంటుందని తెలుస్తోంది. పర్‌ఫెక్షనిస్ట్ అయిన డైరెక్టర్ శంకర్ ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.


Click it and Unblock the Notifications