అది కుక్కతో కూడా ఉండొచ్చు, పెళ్లి లేదు సెక్స్ ఎలా?... సుమంత్ రియాక్షన్ ఇదీ!
తన తాజా చిత్రం 'సుబ్రహ్మణ్యపురం' సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న హీరో సుమంత్ తన పర్సనల్ లైఫ్ గురించి ఎదురైన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. గతంలో నటి కీర్తి రెడ్డిని పెళ్లాడి విడిపోయిన సుమంత్ మరో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుమంత్ మాట్లాడుతూ... కీర్తి రెడ్డితో విడిపోయినా తనతో ఇప్పటికీ మంచి ప్రెండ్షిప్ ఉండటం తన అదృష్టంగా చెప్పుకొచ్చారు. కీర్తి రెడ్డి మరో పెళ్లి చేసుకుని సెటిలయ్యారు.. మరి మీరెప్పుడు చేసుకుంటారు? అనే ప్రశ్నకు సుమంత్ స్పందిస్తూ.... 'ఏమో తెలియదండీ. దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు' అని సమాధానం ఇచ్చారు.

ఆ రెండూ చేయడం లేదు
ఒంటరి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారా? లేక ఒంటరి జీవితంపై ఏదైనా బాధ ఉందా? అనే ప్రశ్న ఎదురవ్వగా ‘ఆ రెండూ చేయడం లేదు. ఎంజాయ్మెంట్ అంటే ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నేను మాత్రమే కాదు. చాలా మంది సింగిల్ గా ఉంటున్నారు. అయితే ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని చెప్పడం లేదు. ఇప్పుడైతే ఆ ఆలోచన లేదు' అని సుమంత్ సమాధానం ఇచ్చారు.

అది కుక్కతో కూడా చేయొచ్చు
మ్యాన్ ఫర్ ది ఉమెన్.. ఉమెన్ ఫర్ ది మ్యాన్ అనే దాన్ని నేను నమ్మను అని సుమంత్ స్పష్టం చేశారు. ఒక పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందని, ఒక స్త్రీ విజయం వెనక ఒక పురుషుడు ఉంటాడనేది నిజం కాదు. చాలా మంది గొప్పవారు వారి వెనక అలాంటి వారు ఎవరూ లేకుండా ఎదిగారు. ‘కంపానియన్‌ఫిప్' అనేది ఒకటి కావాల్సి ఉంటుంది కదా అనే దానికి సుమంత్ రియాక్ట్ అవుతూ ‘అది కుక్కతో కూడా ఉండొచ్చండీ' అంటూ సమాధానం ఇచ్చారు.

మరి సెక్స్ ఎలా?
మనిషి జీవితానికి, శరీరానికి సెక్స్ అనేది కూడా ఎంతో ముఖ్యం....అలాంటివి కుక్కతో సాధ్యం కాదు కదా అంటూ యాంకర్ ఎదురు ప్రశ్నించగా... ‘నా జీవితంలోని ఆ పార్ట్ గురించి నేను మాట్లాడను' అంటూ ఆ ప్రశ్నను స్కిప్ చేసే ప్రయత్నం చేశాడు సుమంత్.

మీపై ప్లే బోయ్ అనే ప్రచారం ఉంది
మీపై ఒక వండర్ ఫుల్ ప్లేబోయ్ అనే ఒక ప్రచారం ఉంది. మీరు కూడా నెం.1 యారిలో మీ పాత గర్ల్ ఫ్రెండ్స్ గురించి చెప్పారు. వారిలో ఎవరినీ సెలక్ట్ చేసుకోలేదా? లివ్ ఇన్ రిలేషన్ షిప్ లాంటివి ఏమీ చేయడం లేదా? అనే ప్రశ్నకు .... ‘వాటి గురించి ఎప్పుడూ ఆలోచించలేదండీ. ప్రస్తుతం నేను మ్యాపీగా ఉన్నాను' అంటూ సుమంత్ స్పష్టం చేశారు.

అది పూర్తిగా ప్రైవేట్
సెక్స్ లాంటి అంశాలు ప్రైవేట్‌గా చేసే పనులు. అలాంటపుడు ఆ విషయాలు ప్రైవేట్‌గా ఉంచాలి. వాటి గురించి ఎవరికీ చెప్పాల్సిన పని లేదంటూ... తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.


Click it and Unblock the Notifications











