‘తూనీగ తూనీగ’ సుమంత్ అశ్విన్ తదుపరి చిత్రం ఆ దర్శకుడుతో...
'అలా మొదలైంది' వంటి సూపర్ హిట్ చిత్రం అందించిన తర్వాత కె.దామోదర్‌ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం కోసం కథ కొన్నాళ్లుగా స్క్రిప్టు వర్క్ జరిగింది. దర్శక, నిర్మాతలు, హీరో ఈ స్క్రిప్టు మీద మంచి నమ్మకంతో ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి కల్యాణి మాలిక్ స్వరాలందిస్తారు. వివేక్ కూచిభొట్ల ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా, సెప్టెంబర్ రెండో వారంలో చిత్రీకరణ మొదలుకానుంది. ప్రస్తుతం హీరోయిన్ ని సెర్చింగ్ లో టీమ్ బిజీగా ఉన్నారు. ఇక హీరో కోసం ఈ టీమ్ ..పేస్ బుక్ లో ట్యాలెంట్ హంట్ చేసి మరీ ఈ హీరోని ఎన్నుకున్నారు.
ఇక 'తూనీగ తూనీగ' తర్వాత సుమంత్ అశ్విన్ కి చాలా ఆఫర్స్ వచ్చినట్లు సమాచారం. వరుణ్ సందేశ్ కు ప్రత్యన్మాయంగా ఈ యంగ్ హీరోని చాలా మంది సంప్రదించారు. అయితే మంచి కథ,కథనం కుదిరితేనే తన తదుపరి చిత్రం ఓకే చేయాలనే ఆగినట్లు సమాచారం. అందులోనూ 'తూనీగ తూనీగ'చిత్రం బడ్జెట్ పరంగా,నిర్మాణ విలువల పరంగా రిచ్ గా ఉన్నా కథ,కన్థనం సరిగ్గా లేకపోవటంతో ఫలితం లేకుండా పోయింది. దాంతో ఎమ్.ఎస్ రాజు తన కుమారుడుతో చేయాలనుకునే వారు దర్సకుడు,కథ,బ్యానర్ ఈ మూడు ముఖ్యము అన్నట్లుగా చూస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications












