ఫస్ట్ లుక్ ప్రామిసింగ్ గా ఉంది..(ఫొటో)
హైదరాబాద్ : సుమంత్ అశ్విన్, రెహానా జంటగా మహిస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. రచయిత వేమారెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సి.హెచ్.నరసింహాచారి, నరసింహారెడ్డి ఇలవల నిర్మాతలు. చిత్రానికి 'చక్కిలిగింత' అనే పేరు ఖరారు చేశారు. ఈ సందర్బంగా చిత్రం ఫస్ట్ లుక్ ని ఆదివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. మీరు చూస్తున్న ఫస్ట్ లుక్ అదే. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సుకుమార్ వచ్చారు.
సుకుమార్ మాట్లాడుతూ ''నేనూ, వేమారెడ్డి, మరో దర్శకుడు ప్రకాష్ తోలేటి ఒకేసారి మా ప్రయాణం ప్రారంభించాం. కష్టసుఖాలు పంచుకొన్నాం. వేమారెడ్డి ఇప్పుడు దర్శకుడిగా మారడం సంతోషంగా ఉంది. పాటలు విన్నాను.. బాగున్నాయి. సినిమా పేరు ప్రచార చిత్రమూ ఆకట్టుకొన్నాయి''అన్నారు.

''ఇంతమంచి కథ, సాంకేతిక నిపుణుల బృందం దొరకడం నా అదృష్టం. భవిష్యత్తులో ఈ చిత్రబృందం మిమ్మల్ని నిరుత్సాహపరచకుండా మంచి సినిమాలు తీస్తుందన్న నమ్మకం ఉంది''అన్నాడు అశ్విన్. ''రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో పాటల్ని విడుదల చేస్తాము''అన్నారు దర్శకుడు.
లవర్స్ చిత్రం ద్వారా కమర్షియల్ విజయాన్ని అందుకున్న సుమంత్ అశ్విన్ ప్రస్తుతం రచయిత వేమారెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రంలో నటిస్తున్నాడు. మ్రితిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మహి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సీహెచ్.నరసింహాచారి, ఇలవల నరసింహారెడ్డి నిర్మిస్తున్నారు. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
చైతన్యకృష్ణ, సప్తగిరి, జోష్ రవి, వైవా హర్ష, వేణు, సురేఖావాణి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా: సాయి శ్రీరామ్, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











