ప్రేమలు...ఛాలెంజ్ లు ('చక్కిలిగింత' ప్రివ్యూ)
హైదరాబాద్ : సుకుమార్ క్యాంప్ నుంచి మరొకరు బయిటకు వస్తున్నారు. ఆయన స్నేహితుడు, శిష్యుడు అయిన వేమారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ రోజు విడుదలకు సిద్దమవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్రంపై యూత్ లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. అందులోనూ రొమాంటిక్ కామెడీ అని చెప్పటంతో సినిమాకు ఎ సెంటర్లలలో మంచి ఓపినింగ్స్ ఉంటాయని భావిస్తున్నారు. లవర్స్ చిత్రం ద్వారా కమర్షియల్ విజయాన్ని అందుకున్న సుమంత్ అశ్విన్ ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు.
అమ్మాయిలంటే పడని ఓ కుర్రాడు ఓ అమ్మాయితో ప్రేమలో పడి...ఎలా ఆమె ప్రేమను సాధించాడన్నది కథగా రూపొందింది. కథలో...ఆది (సుమంత్ అశ్విన్) హైదరాబాద్ MIT కాలేజి స్టూడెంట్. అతను అమ్మాయిలు వెనక కుర్రాళ్లు పడటం,ప్రేమను ఎక్సప్రెస్ చేయటం వంటి విషయాలపై నమ్మకం లేనివాడు.దాంతో అతను తన కాలేజీలో ఉన్న కుర్రాళ్లందరి చేతా...అమ్మాయిలను ఎవాయిడ్ చేస్తానని ఒట్టు వేయించుకుంటాడు. ఈ లోగా ఆ కాలేజికి అవంతిక(రెహనా) వైజాగ్ నుంచి వస్తుంది. ఆమె ఆది ఆలోచనలు తప్పని ప్రూవ్ చేస్తానని ఛాలెంజ్ చేస్తుంది. అక్కడనుంచి ఏం జరిగిందనేది మిగతా కథ.

''ఇంతమంచి కథ, సాంకేతిక నిపుణుల బృందం దొరకడం నా అదృష్టం. భవిష్యత్తులో ఈ చిత్రబృందం మిమ్మల్ని నిరుత్సాహపరచకుండా మంచి సినిమాలు తీస్తుందన్న నమ్మకం ఉంది''అన్నాడు అశ్విన్.
బ్యానర్ :మహి ఎంటర్‌టైన్‌మెంట్
నటీనటులు : సుమంత్ అశ్విన్, రెహానా, చైతన్యకృష్ణ, తాగుబోతు రమేష్, సప్త గిరి, జోష్‌రవి, వివా హర్ష, వేణు, సురేఖవాణి, శివన్నారాయణ, అంబ టి వ్రీను, నవీన్ తదితరులు
సంగీతం: మిక్కీ జె.మేయర్,
సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్,
ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్,
పాటలు: వన మాలి, అనంతశ్రీరామ్, శ్రీమణి,
ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్,
డాన్స్: ప్రేమ్‌రక్షి త్, రఘు,
ఫైట్స్: వెంకట్,
నిర్మాతలు: సి.హెచ్.నరసింహాచారి, నరసిం హారెడ్డి ఇలవల,
రచన, దర్శకత్వం: వేమారెడ్డి టి.
విడుదల తేదీ: డిసెంబర్ 5, 2014.


Click it and Unblock the Notifications











