‘చక్కిలి గింత’ పెడతాడంట
హైదరాబాద్ : ‘చక్కిలి గింత' పెట్టాలంటే కాస్త టాలెంట్ కావాలి. అది మా దగ్గర ఉంది అంటున్నారు సుమంత అశ్విన్..వేమా రెడ్డి. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి ఈ టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. దాదాపు ఎనభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.
‘తునీగ తూనీగ' సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన సుమంత్ అశ్విన్ ఇటీవలే విడుదలైన ‘అంతకుముందు ఆ తరువాత' సినిమాలోని నటనతో అందరినీ మెప్పించగలిగాడు. సుకుమార్ అశోశియేట్ వేమా రెడ్డి ఈ సినిమాతో తొలిసారిగా మెగాఫోన్ పట్టి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని నరసింహా రెడ్డి - నరసింహాచారి కలిసిమహి ఎంటర్ టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్ సరసన మృతిక హీరోయిన్ గా నటిస్తోంది. . విభిన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందని సుమంత్ అశ్విన్ చెప్పారు. అడగ్గానే సుమంత్ డేట్స్ ఇచ్చి తమను ప్రోత్సహించిన ఎమ్మెస్‌రాజుగారికి కృతజ్ఞతలని, ‘అంతకు ముందు ఆ తర్వాత' చిత్రంలా... ఈ సినిమా కూడా సుమంత్‌కి మంచి పేరు తెచ్చిపెడుతుందని నిర్మాతలు నమ్మకం వెలిబుచ్చారు.
తాగుబోతు రమేష్, వివా హర్ష, తులసి, అంబటి శ్రీను, జోష్ రవి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కళ: ఏఎస్ ప్రకాష్, రచనా సహకారం: టి.మధుసూదన్, జయంత్, నిర్మాణం: మహి ఎంటర్‌టైన్‌మెంట్స్.


Click it and Unblock the Notifications











