twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒకవేళ ఇండియా యుద్దానికి సిద్దమైతే??: "ఒక్కడు మిగిలాడు" పై హీరో గుండెలని పిండేసే ట్వీట్

    ఈ రోజు మంచు మనోజ్ తీసిన ఒక్కడు మిగిలాడు సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా అయ్‌లాన్ పిక్‌తో సుమంత్ అశ్విన్ ఓ ట్వీట్ చేశాడు.

    |

    అయ్‌లాన్ కుర్ది గుర్తుందా ఈ పేరు? తన మరణం ద్వారా ఈ మూడేళ్ల చిన్నారి.. ప్రపంచానికి తన దేశ దుస్థితిని తెలియజేశాడు. అప్పటి వరకూ సిరియా పరిస్థితి గురించి అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. సిన్రియాలో నెలకొన్న అనిశ్చిత స్థితి, ఆ యుద్దం చాలా జీవితాలనే చిన్నా భిన్నం చేసేసింది. సిరియా యుద్ధం సమయం లొ హృదయాన్ని కదిలించే... ఒక చిన్న పాప మృత దేహం సముద్రం ఒడ్డుకు అలల తాకిడి తొ కొట్టుకు వచ్చింది ఆ ఫోటో ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలొ... కొన్ని కోట్ల హృదయాలను కదిలించింది కానీ అజేయ అనే సినీ దర్శకుడి పెన్ను కదిలింది ఆలోచన రగిలింది... అలా ఆ సంఘటన నుంచే ఒక్కడు మిగిలాడు ఆలోచనకూడా వచ్చింది...

    Recommended Video

    Okkadu Migiladu Movie Review మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’ రివ్యూ
     హీరో సుమంత్ అశ్విన్

    హీరో సుమంత్ అశ్విన్

    ఈ రోజు ఒక్కడు మిగిలాడు సినిమా విడుదల సందర్భంగా హీరో సుమంత్ అశ్విన్ అయ్‌లాన్ కుర్దీ ని గుర్తు చేసాడు. అయ్‌లాన్ కుర్ది, అతని అన్నయ్యలను తీసుకుని వారి తల్లి దండ్రులు కెనడా వెళ్ళే ఉద్దేశ్యంతో టర్కీ తీరంలో పడవ ఎక్కారు. అయ్‌లాన్ కుటుంబం సిరియాలో టర్కీ సరిహద్దులో నివసించే కుర్దు జాతికి చెందినది.

     పడవ తిరగబడింది

    పడవ తిరగబడింది

    సిరియాలో కిరాయి తిరుగుబాటు దరిమిలా ఆ కుటుంబం కూడా టర్కీ శిబిరాల్లో తలదాచుకుంటోంది. వారి బంధువు ఒకరు కెనడాలో నివసిస్తున్నారు. ఆమె అండతో కెనడా వెళ్లాలని కుర్ది కుటుంబం ఆశ. కానీ సముద్రం అల్లకల్లోలంగా మారడంతో బయలుదేరిన కొద్ది సేపటికే వారు ఎక్కిన పడవ తిరగబడింది.

     నిద్రపోతున్నట్లుగానే శవమై

    నిద్రపోతున్నట్లుగానే శవమై

    పిల్లలను, భార్యను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించి అబ్దులా విఫలం అయ్యాడు. చిన్న ఆధారంతో సముద్రంలో తేలుతుంటే 3 గంటల తర్వాత టర్కీ కోస్ట్ గార్డ్ పోలీసులు అతన్ని, మరి కొందరిని ఒడ్డుకు చేర్చారు. సముద్రంలో మునిగిపోయిన అయ్‌లాన్ కుర్ది అలల వెంటపడి టర్కీ ఒడ్డుకు కొట్టుకు వచ్చాడు. సముద్రం ఒడ్డున నిద్రపోతున్నట్లుగానే శవమై పడి ఉన్న ఐలాన్ ను అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్ధ ఫోటోగ్రాఫర్ ఫోటో తీశాడు.

     అయ్‌లాన్ మృతదేహం

    అయ్‌లాన్ మృతదేహం

    ఆ ఫోటో ఇంటర్నెట్ లో విద్యుత్ ప్రవాహంలా పాకిపోయింది. అయ్‌లాన్ మృతదేహం తీర ప్రాంతానికి కొట్టుకువచ్చిన దృశ్యాలను ప్రపంచమంతా చూసి షాక్‌కు గురైంది. మనసున్న ప్రతి మనిషినీ కదిలించింది. రాక్షసమూక ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదాన్ని ప్రతి ఒక్కరూ నిందించారు. అయ్‌లాన్‌కు ప్రపంచమంతా కన్నీటి నివాళి అర్పించింది.

    సుమంత్ అశ్విన్

    సుమంత్ అశ్విన్

    ఈ రోజు మంచు మనోజ్ తీసిన ఒక్కడు మిగిలాడు సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా అయ్‌లాన్ పిక్‌తో సుమంత్ అశ్విన్ ఓ ట్వీట్ చేశాడు. "అతని పేరు అయాన్ కుర్ది. వయసు 3సంవత్సరాలు. అతనికి సాకర్ ఆడటమంటే చాలా ఇష్టం. అతని ఒకే ఒక్క నేరం? 2012లో సిరియాలో జన్మించడం" అంటూ అయాన్ గురించి ట్వీట్ పెట్టాడు.

    ఒకవేళ ఇండియా రేపు యుద్ధానికి సిద్ధమైతే..

    ఒకవేళ ఇండియా రేపు యుద్ధానికి సిద్ధమైతే..

    ఇక కుర్థీ కీ ఈ సినిమాకి ఉన్న సంబందం కూడా అర్థమయ్యేలా మరో ట్వీట్ కూడా పెట్టాడు. "ఒక్కడు మిగిలాడు శరణార్థులు పడుతున్న ఇబ్బందుల్ని ప్రస్తావించింది. ఒకవేళ ఇండియా రేపు యుద్ధానికి సిద్ధమైతే.. అక్కడి బాధితులు పడుతున్న ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తుంది. వారు పడుతున్న బాధల్ని థియేటర్‌లో చూడండి." అంటూ ట్వీట్ చేశాడు.

    English summary
    Hero Sumanth Ashwin Rememberd Aylan Kurdi a chaild victim of Syrian War in a Tweet about Manchumanoj's "Movie Okkadu Migiladu"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X