సక్సెస్ కాలేదని ఎవరినీ నిందించకూడదు..సుమంత్
'గత కొంతకాలంగా నేను చేసిన చిత్రాల్లో వైవిధ్యం వుండేలా ప్రయత్నించాను. కానీ కమర్షియల్ గా అనుకున్న సక్సెస్ రాని మాట నిజమే. ఆ విషయంలో ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు. బహుశా ఆ సినిమాల ఎంపికలో నా జడ్జిమెంట్ తప్పయిందని అనుకుంటున్నాను" అన్నారు సుమంత్. ఆయన కథానాయకుడిగా రవి చావలి దర్శకత్వం వహించిన 'దగ్గరగా దూరంగా" చిత్రం ఈ రేపు(26.08.11)న ప్రేక్షకుల ముందుకురానుంది. సామాజిక సమస్యల నేపథ్యంలో సాగే కథాంశాలకు వాణిజ్య అంశాలను మేళవించి తెరకెక్కించే దర్శకుడు చావలి రవికుమార్. ఆయన దర్శకత్వంలో సుమంత్ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం 'దగ్గరగా… దూరంగా…" సుధా సినిమా పతాకంపై జె సాంబశివరావు నిర్మించారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ''సుమంత్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోయే సినిమా ఇది. దర్శకుడు చావలి రవికుమార్ జనరంజకంగా ఈ సినిమాను మలిచారు. కథ, కథనం, పాత్రల తీరుతెన్నులు అన్నీ సహజంగా ఉంటాయి. అన్ని తరగతుల వారినీ ఈ సినిమా అలరిస్తుంది" అని తెలిపారు. వేదిక నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సింధు తులాని, బ్రహ్మానందం, రఘుబాబు, ఆహుతి ప్రసాద్, కృష్ణభగవాన్, అజయ్, కొండవలస, ప్రగతి, సత్యం రాజేష్, దువ్వాసి మోహన్, రవి ప్రకాష్ ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె అందించనున్నారు.


Click it and Unblock the Notifications











