నాగార్జున ఆ హిట్ సాంగ్ ని రీమిక్స్ చేస్తున్న సుమంత్

By Srikanya

నాగార్జున కెరీర్ లో హిట్ సాంగ్ గా నిలిచిన భీమవరం బుల్లోడా పాలు కావాలా (ఘరానా బుల్లోడు) పాటని సుమంత్ చిత్రం కోసం రీమిక్స్ చేయనున్నారు. కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి,విమలారామన్ నటిస్తున్నారు. ప్రియమణి ఈ పాటలో సుమంత్ సరసన డాన్స్ చేయనుంది. మనసంతా నువ్వే ఫేమ్ వియన్ ఆదిత్య డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఇక భీమవరం బుల్లోడా పాటను కీరవాణి స్వరపరిచారు. అందుకోసం ఆయన పర్మిషన్ తీసుకుని మరీ రీమిక్స్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో లిప్ టు లిప్ కిస్ కూడా ఉంది. ఎప్పుడూ అటువంటి సీన్స్ కు బాగా దూరంగా ఉండే సుమంత్...ఈసారి ప్రియమణికి పూర్తి స్ధాయిలో సహకరించి ఈ సీన్ ని పండించాడుట. ఇక ఈ చిత్రానికి రిమ్ జిమ్ అనే టైటిల్ పెట్టాలని నిర్ణయించారు. ఇక ఈ చిత్ర నిర్మాతలు కుమార్ బ్రదర్శ్...గతంలో నా గర్లె ప్రెండ్ బాగా రిచ్, సాధ్యం చిత్రాలు రూపొందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X