మనవడు సుమంత్‌కు దక్కనున్న అక్కినేని ఆస్తులు!
హైదరాబాద్: తెలుగు సినిమా దిగ్గజం, దాదా పాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు మరణం తెలుగు సినిమా లోకాన్ని విషాదంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. 90 ఏళ్ల అక్కినేని సెంచరీ కొడతారని ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు ఆ కోరిక తీరలేదు. కొంత కాలంగా క్యాన్సర్ వ్యాదితో బాధ పడుతున్న ఆయనకు గుండె పోటు కూడా తోడవటంతో జనవరి 22న మరణించారు.
కాగా....అక్కినేని మరణానంతరం ఆయనకు సంబంధించిన కొన్ని ఆస్తులు ఆయన మనవడు యార్లగడ్డ సుమంత్‌కు కూడా దక్కబోతున్నాయి. అక్కినేని జూబ్లీహిల్స్ నివాసంతో మరికొన్ని ఆస్తులు సుమంత్‌కు దక్కేలా బ్రతికుండగానే ప్లాన్ చేసారట అక్కినేని నాగేశ్వరరావు.

అక్కినేని పెద్ద కూతురు సత్యవతి, సురేంద్ర యార్లగడ్డల కుమారుడు సుమంత్. ఇతను పుట్టిన తరువాత తల్లిదండ్రులు విదేశాలకు వెళ్లారు. తాత అక్కినేని నాగేశ్వరరావు అభ్యర్ధన మేరకు సుమంత్‌ను ఇక్కడే ఉంచారు. సుమంత్‌ను వీరే పెంచి పెద్ద చేశారు. అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ దంపతులు సుమంత్‌ను దత్తపుత్రుడిలా చూసుకునే వారు.
సుమంత్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నాడు. మిచిగాన్‌లో ఇంజనీరింగ్ కోర్సు పూర్తిచేశాడు. సుమంత్ నట జీవితం 1999 సంవత్సరం రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన ప్రేమ కథ చిత్రంతో మొదలైంది. తర్వాత నటించిన సినిమాలు అంతగా ఆడలేదు. అయితే 2003లో జెనీలియాతో నటించి న సత్యంతో చిత్రసీమలో స్థిరపడ్డాడు. 2004 ఆగస్టులో నటి కీర్తిరెడ్డిని వివాహం చేసుకున్నాడు. స్నేహపూర్వకంగా 2006లో విడాకులు తీసుకున్నారు.


Click it and Unblock the Notifications











