కోర్టుకు హాజరైన హీరో సుమంత్, సోదరి సుప్రియ
అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్, అతడి సోదరి సుప్రియ ప్రకాశం జిల్లాలోని మార్కాపుర్ కోర్టుకు హాజరయ్యారు. 'నరుడా డోనరుడా' సినిమాకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో వారు కోర్టుకు హాజరవ్వాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ ఇద్దరూ కలిసి జాన్ సుధీర్‌తో కలిసి 'నరుడా డోనరుడా' సినిమాను నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది. ఈ సినిమాకు ఫైనాన్స్ అందించిన ఫైనాన్షియర్ తనకు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో ఈ కేసు వేసినట్లు తెలుస్తోంది.

త్వరలోనే డబ్బు సర్దుబాటు చేస్తామని ఫైనాన్షియర్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అక్కినేని ఫ్యామిలీ, అన్నపూర్ణ స్టూడియో సపోర్టు ఉన్న సుమంత్, సుప్రియ లాంటి వ్యక్తులు ఫైనాన్షియల్ అంశంలో కోర్టకు రావడం చర్చనీయాంశం అయింది.
బాలీవుడ్లో హిట్ అయిన 'వికీ డోనర్' చిత్రాన్ని తెలుగులో 'నరుడా డోనరుడా' పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాతో పల్లవి సుభాష్ హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. తనికెళ్ళభరణి ప్రముఖ పాత్రను పోషించారు. గోల్కొండ హైస్కూల్, ఊహలు గుసగుసలాడే చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన మల్లిక్‌రామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.


Click it and Unblock the Notifications











