కీర్తిరెడ్డిని మళ్లీ కలుసుకోవడమా? ఆమెకు ఇద్దరు పిల్లలు.. జీవితం సినిమా కాదు.. సుమంత్

By Rajababu

Recommended Video

కీర్తిరెడ్డిని మళ్లీ కలుసుకోవడమా ? నెవర్ !

అక్కినేని సినీ కుటుంబ వారసత్వంగా ప్రేమకథ చిత్రంతో సుమంత్ టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని రాబట్టలేదు. కానీ సత్యం, గౌరీ, గోదావరి లాంటి చిత్రాలు సుమంత్‌ను నిలబెట్టాయి. అయితే వరుసగా చిత్రాలు పరాజయం పొందడంతో టాలీవుడ్ రేసులో వెనుకబడ్డాడు. తాజాగా మల్లిరావా చిత్రం మంచి సుమంత్‌కు ఊపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌తో సుమంత్ మాట్లాడుతూ.. తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకొన్నారు. అవి మీ కోసం..

రాంగోపాల్ వర్మతో విభేదాలు

రాంగోపాల్ వర్మతో విభేదాలు

దర్శకుడు రాంగోపాల్ వర్మతో కొన్ని విభేదాలు వచ్చాయి. నా తొలి చిత్రం క్లైమాక్స్ నాకు నచ్చలేదు. ప్రేక్షకులకు కూడా క్లైమాక్స్ నచ్చపోవడం వల్ల సినిమా యావరేజ్‌గా ఆడింది. టైటానిక్ చిత్ర ప్రభావంతో విషాదకర ముగింపు ఇవ్వాలని నిర్ణయించాం. ప్రేమ కథ చిత్రంలో హీరో, హీరోయిన్ చనిపోవడం ఆ సినిమాకు మైనస్.

సినిమా షూటింగ్‌ల్లో జోక్యం

సినిమా షూటింగ్‌ల్లో జోక్యం

షూటింగ్ ఆరంభంలోనే సినిమా జాతకం తెలిసిపోతుంటుంది. కొన్నిసార్లు నేను ఆ విషయంలో జోక్యం చేసుకొన్నాను. అన్ని విషయాల్లో తలదూర్చను. నా సొంత ప్రొడక్షన్‌లో అయితే మార్పులు, చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. మిగితా ప్రొడక్షన్లలో అది కుదరదు.

సినిమా బాగాలేకపోతే

సినిమా బాగాలేకపోతే

సినిమా సరిగా రాలేదని భావించిన తర్వాత సత్యం చిత్రంలో అనేక మార్పులు చేశాం. దర్శకుడు ఒప్పుకోకపోతే పక్కన పెట్టి రిలీజ్‌కు వారం ముందే మార్పులు చేశాం. అది వర్కవట్ అయింది. అయితే అన్నిసార్లు అది కుదరదు. ఎందుకంటే నాగార్జున చిత్రం భాయ్ విషయంలో ఎంత మార్పులు చేసినా ఫలితం లేకుండా పోయింది.

కీర్తిరెడ్డితో విడాకులు

కీర్తిరెడ్డితో విడాకులు

కీర్తిరెడ్డి నాది లవ్ మ్యారేజ్, పెళ్లికి ముందు మేము ఇద్దరం మంచి స్నేహితులం. అయితే నా అవగాహన లోపం వల్లే విడాకులు తీసుకొన్న వాస్తవం కాదు. ఎవరి వైవాహిక జీవితమైనా విడాకుల వరకు వచ్చిందంటే రెండు వైపుల తప్పులు ఉంటాయి.

ఏదో జరిగిందని అనుకోవద్దు

ఏదో జరిగిందని అనుకోవద్దు

స్నేహితులమైనప్పటికీ వైవాహిక జీవితంలో ఎందుకో ఇమడలేకపోయాం. అయితే దాంతో మా మధ్య ఏదో జరిగిపోయింది అని అనుకోవడానికి వీలు లేదు. విడాకుల తర్వాత కూడా మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్‌గానే ఉన్నాం. సినిమా పరిశ్రమలో ఉండి విడిపోయిన వారెందరూ ఉన్నాం. మా విషయంలో కూడా అదే జరిగింది.

కీర్తిరెడ్డికి ఇద్దరు పిల్లలు

కీర్తిరెడ్డికి ఇద్దరు పిల్లలు

నాతో విడిపోయిన తర్వాత కీర్తిరెడ్డి మళ్లీ పెళ్లి చేసుకొన్నది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంచి దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. దేవుడి దయ వల్ల మేమిద్దరం మంచి స్నేహితులగానే ఉన్నాం. వాళ్ల కుటుబంలో నన్ను ఓ సభ్యుడిగా చూస్తారు.

కీర్తిరెడ్డిని మరిచిపోలేక

కీర్తిరెడ్డిని మరిచిపోలేక

కీర్తిరెడ్డిని మరిచిపోలేకనే నేను ఒంటరిగా ఉన్నానడం చాలా తప్పు. మేము మళ్లీ కలుసుకోవాలనుకోలేదు. విడిపోయిన తర్వాత సినిమాలో మాత్రమే కలుసుకోవడానికి వీలు ఉంటుంది. జీవితం సినిమా కాదు. మల్లిరావే చిత్రం మాదిరిగా జీవితం ఉండదు.

తప్పు చేస్తే సరిదిద్దుకునే

తప్పు చేస్తే సరిదిద్దుకునే

లైఫ్‌లో ఏదైనా తప్పు చేస్తే సరిదిద్దుకొనే పరిస్థితి రాలేదు. అలాంటి వాటిని నేను పట్టించుకోను. కాకపోతే అప్పుడప్పుడు ఆ సినిమా చేయాల్సింది కాదని, ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండు అని ఆలోచనలు వస్తాయి. కానీ వాటి గురించి ఆలోచించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.

ఓటమి చెందాననే ఫీలింగ్

ఓటమి చెందాననే ఫీలింగ్

జీవితంలో ఓటమి చెందామనే ఫీలింగ్ వస్తుంది. సత్యం సినిమాకు ముందు నేను రెండేళ్లు నటించలేదు. సత్యం సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలువడంతో ఆ బాధపోయింది. మళ్లీ గోల్కొండ హై స్కూల్ తర్వాత మళ్లీ అలాంటి బాధ కలిగింది. ఇప్పుడు మల్లిరావా చిత్రం సంతృప్తి ఇచ్చింది.

డబ్బు కోసం నేను చూడను

డబ్బు కోసం నేను చూడను

నేను ఎప్పుడు డబ్బు కోసం పాకులాడను. నాకు మంచి కుటుంబ నేపథ్యం ఉంది. నేను సంపాదించిన డబ్బును మంచిగా ఇన్వెస్ట్ చేశాను. పొదుపు చేశాను. డబ్బు గురించి బాధపడాల్సిన అవసరం నాకు లేదు. డబ్బు కోసం సినిమాలు చేయను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X