ప్రేక్షకులను అలరిస్తున్న పౌరుడు సినిమా పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్న హీరో సుమంత్ తాను నటించే తర్వాతి సినిమా లవ్ స్టోరీ అని చెబుతున్నాడు. పది రోజుల్లో వివరాలు చెప్తానని అంటున్నాడు. మార్చిలో షూటింగ్ ప్రారంభమవుతుందట. తాను మల్టీ స్టారర్ సినిమాలో నటించడానికి ఎప్పుడూ సిద్ధమైనని, క్లాస్ మేట్స్ వంటి సినిమాల్లో నటించడం ద్వారా తాను ఆ సూచన చేశానని, అయితే అటువంటి కథను తయారు చేయాల్సింది రచయితలేనని ఆయన అంటున్నారు. మల్టీ స్టారర్ చిత్రంలో తన పాత్ర పది నిమిషాలు ఉన్నా ఫరవా లేదని, అయితే బలమైన పాత్ర అయి ఉండాలని అంటున్నాడు. గోదావరి, మధుమాసం సినిమాల తర్వాత ఆ ఇమేజ్ కు దూరం కావాలనుకున్నానని, అందులో భాగంగానే పౌరుడు సినిమా చేశానని, పౌరుడు సినిమా బాగా ఆడుతోందని ఆయన అంటున్నాడు. క్లాస్ కు, మాస్ కు నచ్చే సినిమాలు చేయాలనేది సుమంత్ ఉద్దేశంగా కనిపిస్తోంది. పౌరుడు సినిమాకు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్ల ఓపెనింగ్స్ బాగా ఉన్నాయని అంటున్నాడు.