ఇరువురి భామల ప్రేమతో నలిగిపోయే వ్యక్తి కధే ఇది..

By Nageswara Rao

సుమంత్, ప్రియమణి, విమలారామన్ ముఖ్యతారలుగా కుమార్ బ్రదర్స్ పతాకంపై వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో గౌటి హరినాధ్, కుమార్ బ్రదర్స్ రూపొందిస్తున్న చిత్రం 'రాజ్". చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్రంలో కథానాయకుని పేరు 'రాజ్". ఎవరినైనా ఎదురించే ధైర్యం అతని సొంతం. ఎంతటి రాజ్ అయినా... ప్రేమలో పడితే చిక్కులు కొనితెచ్చుకోవడమే. అయితే ఈ రాజ్ ఒకరు కాదు... ఏకంగా ఇద్దరితో ప్రేమాయణం కొనసాగిస్తుంటాడు.

ఒకరి ప్రేమనే తట్టుకోవడం కష్టమైతే...రాజ్ ఇరువురి భామల ప్రేమతో నలిగిపోతాడు. మరి చివరకు రాజ్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది... అనేది ఇందులో ఆసక్తిగా ఉంటుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కటి చిత్రం ఇది"" అన్నారు. సుమంత్ మాట్లాడుతూ- ''తొలిసారి ముక్కోణపు ప్రేమకథలో నటిస్తున్నాను. ఇందులో నేను ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్‌గా కనిపిస్తాను. ఇరువురు భామల మధ్య ఓ ఫ్యాషన్ డిజైనర్ పడ్డ ప్రేమ పాట్లేంటో దర్శకుడు ఇందులో అందంగా తెరెక్కించారు"" అని చెప్పారు. త్వరలోనే పాటలను విడుదల చేసి ఫిబ్రవరి మొదటివారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తామని నిర్మాతలు చెప్పారు.

బ్రహ్మానందం, గిరిబాబు, సయాజీ షిండే, అలీ, అజయ్, శ్రీనివాసరెడ్డి, వేణుమాధవ్, శకుంతల తదితరులు ఇతర పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎ.పాండురంగ, ప్రాజెక్ట్ -కో-ఆర్టినేటర్: దిలీప్ సింగ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X